Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?
ప్రధానాంశాలు:
నేత్రావతి నది స్నానఘట్టానికి అవతల మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది ఒడ్డున చెప్పలేనన్ని ఘోరాలు జరిగాయని ఒక విజిల్ బ్లోయర్ (సమాచారం బయటపెట్టిన వ్యక్తి) చెప్పడంతో ఈ విషయం తీవ్ర సంచలనం సృష్టించింది. వందల మంది అదృశ్యమయ్యారని, లెక్కలేనన్ని శవాలను తాను పూడ్చేశానని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సాక్ష్యాలు, అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అతని వెంట తీసుకెళ్లి కొన్ని గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా, 13 చోట్లలో తవ్వకాలు ప్రారంభించారు…

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?
Dharmasthala ధర్మస్థలలో దశాబ్దాల రక్తచరిత్ర.. నేత్రావతి నది ఒడ్డున ఏం జరిగింది..?
తవ్వకాలలో భాగంగా 6వ పాయింట్ వద్ద మానవ అస్థిపంజరం, కొన్ని మానవ అవశేషాలు లభ్యం కావడంతోపాటు కొన్ని లోదుస్తులు, డెబిట్ కార్డు, పర్సు, ఎర్ర జాకెట్టు వంటి వస్తువులు బయటపడటం మరిన్ని అనుమానాలకు దారితీసింది. లభ్యమైన డెబిట్ కార్డు బెంగళూరుకు చెందిన సురేశ్, అతని తల్లి లక్ష్మికి చెందినదిగా గుర్తించారు. మహిళల లోదుస్తులు కూడా దొరకడంతో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలంలో పిల్లలు, మహిళలు, పాఠశాలకు వెళ్లే బాలికల మృతదేహాలను కూడా పాతిపెట్టినట్లు చెప్పడం దేశాన్ని కుదిపేస్తోంది. 1995 నుండి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పనిచేసిన ఈ వ్యక్తి, తన చేతులతో వందల శవాలను పూడ్చిపెట్టానని, పాపభీతి వెంటాడటంతోనే ప్రాణభయంతో ఈ విషయాలను బయటపెడుతున్నానని తెలిపాడు. తాను పూడ్చిన ఒక శవం ఎముకల ఫోటోలను కూడా ఆధారంగా చూపించాడు.
Dharmasthala ధర్మస్థలి మిస్టరీ..తవ్వకాల్లో బయటపడుతోన్న లెక్కలేనన్ని శవాలు
ఈ సంచలన విషయాలను సీల్డ్ కవర్‌లో పెట్టి అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదికి అందించినట్లు సమాచారం. 2003లో ధర్మస్థలలో అన్యన్యభట్ అదృశ్యమైన కేసుతో పాటు, వేదవల్లి, పద్మలత, మరో 17 ఏళ్ల అమ్మాయి అదృశ్యం కేసుల మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. అనధికారికంగా అదృశ్యమైన మైనర్ల సంఖ్యకు లెక్కేలేదని తెలుస్తోంది. ఫిర్యాదుదారుడు ఎక్కువగా లోదుస్తులు లేని యువతులు, పాఠశాలకు వెళ్లే బాలికల శవాలనే పాతిపెట్టినట్లు చెబుతున్నాడు. ధర్మస్థలలో నిజంగా ఇన్ని ఘోరాలు జరిగాయా? ఇన్నేళ్లు ఎందుకు ఈ నిజాలు బయటపడలేదు? ఒకవేళ ఇన్ని ఘోరాలు జరుగుతున్న అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాన్ని తేల్చేందుకు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.