Donald Trump : భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి.. ట్రంప్ భారీ షాక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donald Trump : భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి.. ట్రంప్ భారీ షాక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  ట్రంప్ ఆదేశాలతో ఇక అమెరికా లో భారతీయులకు ఉద్యోగాలు లేనట్లే

  •  Donald Trump : భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి.. ట్రంప్ భారీ షాక్..!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన “అమెరికా ఫస్ట్” సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించారు. వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన, అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీయులను కాకుండా స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా భారతీయులు అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో అధికంగా నియమితులవుతుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు విదేశీయులకు అవకాశాలు ఇవ్వడం మానుకుని స్థానికులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

Donald Trump భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి ట్రంప్ భారీ షాక్

Donald Trump : భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి.. ట్రంప్ భారీ షాక్..!

Donald Trump : భారతీయులకు ఎట్టిపరిస్థితుల్లో జాబ్స్ ఇవ్వకండి అంటూ Apple, Google, Tesla కంపెనీలకు ట్రంప్ ఆదేశాలు

ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం.. గ్లోబలిస్టు దృక్పథంతో అమెరికా టెక్ సంస్థలు పని చేయడం వల్ల అక్కడి ఉద్యోగుల హక్కులు పట్టింపు అవుతున్నాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, చైనాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం ద్వారా అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ట్రంప్ పాలనలో తన ఆదేశాల ప్రకారం కంపెనీలు అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించి, అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తన హయాంలో విదేశీ కార్మిక నియామకంపై నియంత్రణలు కూడా విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలు భారతదేశంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ స్పష్టంగా “ఇంకా భారతీయులకు ఉద్యోగాలు అవసరం లేదు” అంటూ చేసిన వ్యాఖ్యలు, భారత ఐటీ రంగానికి పెద్ద ఎదురుదెబ్బగా నిలవవచ్చు. ఇప్పటికే అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలు – అవుట్సోర్సింగ్ రంగం – భవిష్యత్తులో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ట్రంప్ ప్రకటనలతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉండడంతో, భారత్ నుంచి వెళ్లే ఐటీ వర్కర్ల సంఖ్య తగ్గే ప్రమాదం కూడా కనిపిస్తుంది.

ఇదే సమయంలో ట్రంప్ “ఏఐ” అనే పదాన్ని కూడా విమర్శించారు. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ” అనే పదం త‌న‌కు న‌చ్చ‌ద‌ని, ఇది టెక్నాలజీకి త‌గిన పేరు కాద‌ని అన్నారు. దీన్ని “జీనియస్ ఇంటెలిజెన్సీ”గా పిలవాల‌ని సూచించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది