Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ “గోల్డ్ కార్డు” తీసుకోవాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ “గోల్డ్ కార్డు” తీసుకోవాల్సిందే

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2025,5:42 pm

ప్రధానాంశాలు:

  •  Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే "గోల్డ్ కార్డు" తీసుకోవాల్సిందే

Donald Trump : అమెరికాలో స్థిరపడాలని ఆశించే విదేశీయుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త “గోల్డ్ కార్డు” స్కీమ్ చర్చనీయాంశమవుతోంది. ఈ స్కీమ్ ప్రకారం.. అమెరికాలో $5 మిలియన్ (సుమారు రూ. 41 కోట్లు) పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు శాశ్వత నివాస హక్కు (Green Card)తోపాటు భవిష్యత్‌లో పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చిందని తెలుస్తోంది.

Donald Trump యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ గోల్డ్ కార్డు తీసుకోవాల్సిందే

Donald Trump : యూఎస్ లో శాశ్వత నివాస హక్కు పొందాలంటే ఈ “గోల్డ్ కార్డు” తీసుకోవాల్సిందే

Donald Trump  ట్రంప్ గోల్డెన్ ఆఫర్..ఎవరికో తెలుసా..?

ఈ గోల్డ్ కార్డు స్కీమ్ ప్రారంభమైన ఒక్క రోజులోనే 1000కి పైగా కార్డులు విక్రయమైనట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ వెల్లడించారు. ఇది విదేశీ పెట్టుబడిదారుల మద్ధతుతో పాటు ట్రంప్ చేపట్టిన ఈ విధానం పట్ల ఉన్న ఆసక్తిని కూడా సూచిస్తుంది. విదేశీయులు అమెరికాలో నివసిస్తూ వ్యాపారాలు నిర్వహించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశంగా మారనుంది…

విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ఈ స్కీమ్‌ను కీలకంగా భావిస్తున్నారు. అంతేగాక అమెరికాలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యాలుగా ట్రంప్ ప్రకటించారు. అయితే కొందరు విమర్శకులు మాత్రం డబ్బున్నవారికే శాశ్వత నివాస హక్కు ఇవ్వడం సమాజ సమానత్వానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది