Donald Trump : ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌కాలి

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 7 May 2025, 2:00 pm
  •  Donald Trump : ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌కాలి

Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భార‌త India  సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44 గంటలకు భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్‌లో pakistan ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా దీన్ని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా భారత సాయుధ దళాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. దీనిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశాడు.

Donald Trump : ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌కాలి

Donald Trump : ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌కాలి

Donald Trump ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మాకు ఆపరేషన్ సిందూర్ గురించి కాసేపటి క్రితమే తెలిసింది. భారత్-పాక్ దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నా’’ అని ఆయన అన్నారు. భారత్, పాక్ ఉద్రికత్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్‌తో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపారు. అలానే పాకిస్థాన్ కూడా తమకు దగ్గరి సంబంధాలే ఉన్నాయని పునరుద్ఘాటించారు.

వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. రెండు దేశాలు ఇలా దాడులతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ఇరుదేశాలకు ఎంతో చరిత్ర ఉంది. అలాగే, ఎన్నో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. అయితే, ప్రపంచానికి మాత్రం శాంతి మాత్రమే కావాలి. గొడవలు వద్దు అంటూ ట్రంప్ కోరారు. ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని పౌర, ఆర్థిక, సైనిక లక్ష్యాలేవీ దెబ్బతినలేదు. ఉగ్రవాద శిబిరాలుగా గుర్తించిన వాటిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము అని వెల్లడించింది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి