
Election Offers : ఓటు వేస్తే ఫ్రీగా బీర్, బిర్యానీ, బటర్ దోశతో పాటు మరెన్నో.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడంటే..!
Election Offers : ఓటర్లని ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు ఓట్లరకి అనేక ఆఫర్స్ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఎలక్షన్స్ అధికారులు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలని బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇండోర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, స్థానిక వ్యాపార సంస్థలు ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఓటు వేసే ఓటర్లకు పోహా-జలేబీ, నూడుల్స్, మంచూరియా ఉచితంగా తినిపించనున్నారు. దీంతో పాటు వారికి ఉచితంగా ఐస్‌క్రీం, శీతల పానీయాలు కూడా అందజేయనున్నారు
జిల్లా కలెక్టర్ ఆశిష్‌సింగ్ అధ్యక్షతన ‘ఓటర్ అవగాహన డైలాగ్’లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓ సమావేశంలో జిల్లా అధికారితో పాటు మార్కెట్ అసోసియేషన్, ఫుడ్ అసోసియేషన్, కేఫ్, మాల్, హోటల్ అసోసియేషన్ తదితర వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటింగ్‌లో ఇండోర్‌ను నంబర్‌వన్‌గా నిలపడంతోపాటు ఓటింగ్ ప్రక్రియలో మరింత మంది పాల్గొనేలా చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని నిసర్గ హోటల్‌లో ఓటు వేసిన వారు తమ సిరా గుర్తు చూపిస్తే ఉచితంగా బటర్ దోశ, గీ రైస్, ఒక కూల్ డ్రింక్ ఇవ్వనుంది.
Election Offers : ఓటు వేస్తే ఫ్రీగా బీర్, బిర్యానీ, బటర్ దోశతో పాటు మరెన్నో.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడంటే..!
ఇందుకు సంబంధించి హోటల్ యాజమాన్యం ఓ ప్రకటన కూడా చేసింది. ఇక బెల్లందూర్‌లోని ఓ పబ్ అయితే రెండు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక జగ్గు బీర్ ఉచితంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఇక రవాణా విషయంలో ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ర్యాపిడో ఆఫర్లు ఇచ్చింది. ఓటు వేయడానికి వెళ్లాలనుకున్న వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా క్యాబ్ సేవలు ప్రకటించింది. మే 13న ఓటు వేసే రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఓటు వేసే వారికి ఉచితంగా పోహా-జలేబీ అందించాలని నగరంలోని చప్పన్ షాప్ అసోసియేషన్ నిర్ణయించింది. తొలిసారి ఓటు వేసే వారికి ఐస్‌క్రీం కూడా అందిస్తారట. కృష్ణపుర ఛత్రీ రోడ్ బజరంగ్ మందిర్ సమీపంలోని ఛాయిస్ చైనీస్ సెంటర్ పేరుతో ఏర్పాటైన ఓ సంస్థ ఓటు వేసే ప్రజలకు ఉచితంగా మంచూరియన్, నూడుల్స్ అందించనుంది. ఇది తెలుసుకున్న వారు ఇదేద బాగుందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.