Etela Rajender : పబ్లిక్ లో అసలు విషయం చెప్పి ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ఈటల రాజేందర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Etela Rajender : పబ్లిక్ లో అసలు విషయం చెప్పి ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ఈటల రాజేందర్

Etela Rajender : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 25 రోజుల్లోనే ఏ పార్టీ అయినా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే కష్టమే. ఈ 25 రోజులు ప్రతి పార్టీకి కీలకం. ఎన్నికల తర్వాత ఇక చేసేదేం ఉండదు. కానీ.. ఎన్నికల్లోపు పార్టీలు ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్, […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ గెలుస్తుందని ఈటల ఎందుకు అన్నట్టు?

  •  కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా?

  •  బీజేపీ పరిస్థితి ఏంటి మరి?

Etela Rajender : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 25 రోజుల్లోనే ఏ పార్టీ అయినా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే కష్టమే. ఈ 25 రోజులు ప్రతి పార్టీకి కీలకం. ఎన్నికల తర్వాత ఇక చేసేదేం ఉండదు. కానీ.. ఎన్నికల్లోపు పార్టీలు ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్, బీజేపీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ఉవ్వెత్తున లేస్తోంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వైపు గాలులు వీస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం వచ్చింది. కాంగ్రెస్ కు ఉన్న క్రేజ్ చూసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు భయపడిపోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతలా తెలంగాణలో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే రెండు పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. తాజాగా మహబూబాబాద్ సభలో మాట్లాడిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ బలాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ ను అడ్డుకునే రీతిలో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావద్దు అంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ వస్తే ఇక ప్రజలు బతికే అవకాశం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అంటూ ఈటల స్పష్టం చేశారు.

Etela Rajender : తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్న ఈటల

కాంగ్రెస్ గెలుపు దిశగా సాగడంతో ఆ పార్టీపై అక్కసు వెల్లగక్కారు. చంద్రబాబు బెయిల్ పై బయటికి వచ్చాక కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లోకి నేతలు చేరుతున్నారు కానీ.. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు నమ్మకం లేదు. కాంగ్రెస్ ను గెలిపిస్తే బీఆర్ఎస్ లో కలిపిన చరిత్ర గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేసినా మనం వద్దు అనుకుంటున్న కేసీఆర్ గద్దెనెక్కుతారు. నూటికి నూరు శాతం తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. బీజేపీకే తమ మద్దతు తెలుపుతున్నారన్నారు ఈటల రాజేందర్.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది