Etela Rajender : బీజేపీ నుంచి తనని తానే బయటికి గెంటించుకుంటున్న ఈటల రాజేందర్..?
ప్రధానాంశాలు:
కరీంనగర్ ఎంపీ టికెట్ అడిగిన ఈటల
కుదరదన్న హైకమాండ్
మెదక్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన బీజేపీ
Etela Rajender : నూతిలో పడ్డ ఎలుకలా మారింది ప్రస్తుతం ఈటల రాజేందర్ పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్.. వైద్య శాఖ మంత్రిగా గొప్ప సేవ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా, ఉద్యమ నేతగా, మంత్రిగా ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలు అమోఘం. కానీ అదంతా గతం.. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారో అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచినా.. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోయారు. గజ్వేల్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు ఈటల రాజేందర్. దీంతో ఆయన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్టు అయింది.
అటు కరీంనగర్ లో బండి సంజయ్.. ఇటు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు వాళ్ల రాజకీయ పరిస్థితి గందరగోళంలో పడింది. అందుకే.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది. కానీ.. బండి సంజయ్ కి మెచ్యూరిటీ లేదు.. కరీంనగర్ సీటు తనకే ఇవ్వాలని ఈటల రాజేందర్ అధిష్ఠానాన్ని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈటలకు కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని బీజేపీ అధిష్ఠానం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
Etela Rajender : మెదక్ నుంచి ఎంపీ సీటు ఇస్తామంటున్న హైకమాండ్
మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటలకు హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. మెదక్ నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో తాను అక్కడ ఓడిపోతానని గుర్తించి మల్కాజిగిరిలో అయినా తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని బతిమిలాడినట్టు తెలుస్తోంది. కానీ.. మల్కాజిగిరి సీటును మురళీధర్ రావుకు ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి కరీంనగర్ ఎంపీ టికెట్ హామీ తీసుకొని బీజేపీ నుంచి తనను బలవంతంగా పంపించేలా ఈటల పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.