French President Emmanuel Macron : భార్య చేతిలో తన్నులు తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
French President Emmanuel Macron : భార్య చేతిలో తన్నులు తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.. వీడియో వైరల్
french president Emmanuel Macron : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే చెంప దెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. మాక్రన్ దంపతులు నాలుగు రోజుల పాటు ఆగ్నేయాసియా దేశాలలో పర్యటించనున్నారు.

French President Emmanuel Macron : భార్య చేతిలో తన్నులు తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.. వీడియో వైరల్
french president Emmanuel Macron పాపం..
ఈ పర్యటనలో భాగంగా వారు ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. హనోయ్ విమానాశ్రయంలో మాక్రన్ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకుంటున్న సమయంలో మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టే చెంప మీద కొడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ ఘటనతో మాక్రన్ కొద్దిసేపు ఆగిపోయారు. విమానం తలుపు తెరుచుకున్నట్టు గమనించి వెంటనే నవ్వుతూ బయటకు వచ్చారు. ఆయన వెనుకే బ్రిగెట్టే కూడా బయటకు వచ్చారు.
ఇద్దరూ కలిసి విమానం దిగుతున్న సమయంలో మాక్రన్ తన భార్య చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు బ్రిగెట్టే ఆసక్తి ప్రదర్శించలేదు. తన భర్తపై బ్రిగెట్టే కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు కనిపించారు. అయితే మాక్రన్ మాత్రం తన మొహంలో ఎలాంటి భావాలను బయటకు కనబడనీయకుండా మెయింటైన్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విచిత్ర కామెంట్స్ చేస్తున్నారు.
