Gold Rate : బంగారం కొనాలని అనుకున్నారా..? మీకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు..!
ప్రధానాంశాలు:
Gold Rate : బంగారం కొనాలని అనుకున్నారా..? మీకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు..!
Gold Rate : కిందటి వారం వరకు బంగారం ధరలు భారీగా ఉండగా.. గత నాలుగు రోజులుగా ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే రూ.3 వేలకుపైగా తగ్గింది. ఈ ధరలు తగ్గడాన్ని గమనించిన గోల్డ్ లవర్స్ ఇప్పటికే కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. తులం బంగారం ధర రూ. 56,000 వరకు తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మొత్తం బంగారం ధరలు వరుసగా ఆల్‌టైమ్ రికార్డులను తాకగా, ట్రంప్ సర్కార్ తీసుకున్న దిగుమతి సుంకాల నిర్ణయం తరువాత ఈ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం మొదలైంది.

Gold Rate : బంగారం కొనాలని అనుకున్నారా..? మీకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు..!
Gold Rate హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ధరల వివరాలు చూస్తే..
ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.8,224 కాగా, 10 గ్రాముల ధర రూ.82,249గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.8,972, 10 గ్రాములకు రూ.89,720గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, భోపాల్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కూడా రూ.82,240 (22 క్యారెట్లు), రూ.89,720 (24 క్యారెట్లు) పరిధిలోనే ఉన్నాయి. ఇది బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
Gold Rate వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల
బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కేజీ వెండి ధర రూ.1,02,900గా ఉంది. అయితే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర రూ.93,900గా నమోదైంది. వివాహం, శుభకార్యాల సమయంలో వెండి కొనుగోళ్లకు మంచి మద్దతు ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గిన ఈ సమయంలో కొనుగోలు చేయడం లాభదాయకం కావొచ్చు. ఈ తగ్గిన ధరలు ఎంత కాలం కొనసాగుతాయనేది చెప్పలేని విషయం కావడంతో, ఇలాంటి సమయాల్లో కొనుగోలు నిర్ణయం తెలివిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.