Groom Arrested : పెళ్లి రోజే పెండ్లి కొడుకు అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు రంగప్రవేశం చేసి పెండ్లి కుమారుడిని అరెస్ట్ చేశారు. దాంతో పెండ్లి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు. మహేంద్ర రాజ్ అనే వరుడు గోరఖ్‌పూర్‌లోని బిచియా ప్రాంతానికి చెందినవాడు. షాపూర్‌కు చెందిన ఓ మహిళతో గత 7 ఏళ్లుగా లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. మహిళ ఆరోపణల ప్రకారం, మహేంద్ర ఆమెను ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు మరియు అతని భార్యగా ఆమెను ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. ఆమె తన కుటుంబంతో పరిచయం చేయాల్సిందిగా అడిగినప్పుడల్లా అతడు దాన్ని దాటవేస్తూ వచ్చాడు. తొందరపడవద్దని చెబుతూ వస్తున్నాడు. ఇలా కొంతకాలం సాగింది.

Groom Arrested : పెళ్లి రోజే పెండ్లి కొడుకు అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?
ఆమెను తన కుటుంబ సభ్యులతోనూ కలువనీయకుండా సంబంధాన్ని గోప్యంగా ఉంచాడు. అయితే మహేంద్ర గోరఖ్‌నాథ్ ప్రాంతంలో ఓ యువతితో రెండవ వివాహం నిశ్చయం చేసుకున్నాడు. తిలకం వ్రతం శాంతియుతంగా జరిగినా, పెళ్లి రోజున వరుడి నిజం బయటపడింది. సదరు మహిళ అతడి రెండో పెండ్లి ప్రణాళికల గురించి తెలుసుకుని మహేంద్రను ప్రశ్నించింది.అయితే ఆమెను బెదిరింపులకు గురిచేసిన అతను ఈ విషయాన్ని అధికారులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అయినా ఆ మహిళ భయపడక షాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అన్ని వివరాలు వెల్లడించింది. ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు ఈ విషయంపై విచారణ జరిపి మహేంద్ర రాజ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మహిళ ఆరోపణలను ధృవీకరించిన తర్వాత, అమ్మాయి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. Groom Arrested On Wedding Day After Woman Reveals ,Groom, Arrest, Wedding, Mahendra Raj, Shahpur, Gorakhpur