Husband Wife : భాగస్వామితో కూడా ముద్దు డేంజరే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్ అండ్ హైపోథెసిస్ ఇన్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం ఇందుకు విరుద్దంగా ఫలితాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచింది. భాగస్వామి ముద్దుల వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఇరాన్‌లో కొత్తగా వివాహమైన 1,740 జంటలపై జరిపిన ఈ పరిశోధనలో 268 జంటలను అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రతి జంటలో ఒక భాగస్వామి ఆరోగ్యంగా ఉండగా, మరొకరు నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నట్టుగా శాస్త్రవేత్తలు తేల్చారు.
Husband Wife : భాగస్వామితో కూడా ముద్దు డేంజరే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
సదరు జంటల నుండి నోటి మైక్రోబయోమ్ నమూనాలను, కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను సేకరించి ఆరు నెలల తర్వాత తిరిగి పరిశీలించారు. ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో డిప్రెషన్, ఆందోళన, నిద్ర నాణ్యత తగ్గడం గమనించినట్టుగా పేర్కొన్నారు.
ముఖ్యంగా స్త్రీలలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి. అనారోగ్యంతో ఉన్న భాగస్వామి నుంచి నోటిలోని బ్యాక్టీరియా ఆరోగ్యవంతమైన భాగస్వామికి చేరడం వల్ల మానసిక స్థితి, నిద్ర విధానాలలో మార్పులు సంభవించవచ్చని పరిశోధకులు సూచించారు. నిద్రలేమితో బాధపడేవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండగా, ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో కూడా కార్టిసాల్ స్థాయిలు పెరిగాయి.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.