Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో సిటీ మొత్తం ఏ ఏరియాకి ఆ ఏరియా వినాయకుడి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐతే పూజలు నిర్వహించడం వరకు ఓకే కానీ వినాయక నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అధికారులు ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ట్యాంక్ బడ్న్ దగ్గర నిమజ్జమ పై ఇప్పటికే హైకోర్ట్ క్లారిటీ ఇవ్వగా […]
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో సిటీ మొత్తం ఏ ఏరియాకి ఆ ఏరియా వినాయకుడి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐతే పూజలు నిర్వహించడం వరకు ఓకే కానీ వినాయక నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అధికారులు ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ట్యాంక్ బడ్న్ దగ్గర నిమజ్జమ పై ఇప్పటికే హైకోర్ట్ క్లారిటీ ఇవ్వగా హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో నిఘా పెంచారు అధికారులు.
సిటీ మొత్తం నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు జరగకూడదని దృష్టిపెడుతున్నారు. గణేష్ నిమజ్జనం వేళ ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరగనున్నాయి. ట్యాంక్ బండ్ పరిధిలో దాదాపు 18 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు తగిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రకారం ప్రాన్శాత వారావరణ వేడుక ముగ్సేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Ganesh Nimajjanam పోలీసు శాఖ పెట్టిన నిబంధనలు..
విగ్రలన్నీ తరలించే ముందు పోలీస్ శాఖ నుంచి నమర్లు జారీ చేస్తారు. సౌత్ జోన్ పరిధిలోని గణేష్ విగ్రహాలు ముందు తరలించాల్సి ఉంటుంది. వెహికల్స్ కు తప్పనిసరిగా ఏసీపీ కేటాయించిన నంబర్ ఉంచాలి. ఒక వాహనానికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంటుంది. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ ను పెట్టకూడదు.
డీజేలతో కూడిన మ్యూజిక్ సిస్టెం కూడా ఉండకూడదు. రంగు తుపాకులను వాడరాదు. మద్యం ఇతర మత్తు పదార్ధాలు ఉంచరాదు. వాటిని సేవించరాదని సూచించారు. వీటితో పాటు ఊరేగింపులో కర్రలు, ఆయుధాలు, కత్తులు నిషేధం చేశారు. ఇక ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదని అలా వ్యవహరించే వారిని పోలీసులు చర్యలు తీసుకుంటారని అన్నారు. తప్పనిసరి అయితే 100 కి డయల్ చేసి పోలీసుల హెల్ప్ తీసుకోవాలని సూచించారు.