Pawan Kalyan : సీఎం కుర్చీ ఎక్కేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ కి నమ్మలేని బ్రేకింగ్ న్యూస్..!
Pawan Kalyan : ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టి ఏం చేస్తారు. తమ పార్టీ గెలవాలని.. తాము ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. అందుకే కదా.. ఎవరైనా పార్టీ పెట్టేది. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం క్యాండిడేట్ కాదట. అవును.. ఆయన సీఎం కాలేనని ఆయనే తెలిసిందట. ఒకసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతా అని.. మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కనని చెప్పుకొస్తున్నారు. అసలు జనసేన అధినేత మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయనకైనా తాను ఎందుకు పార్టీ పెట్టానో అర్థం అవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి.
నేను నా అభిమానుల కోసమే సీఎం అంటున్నాను తప్పితే వేరే కాదు. నేను సీఎం కాలేను అంటూ మరోసారి మాట్లాడుతారు. నన్ను సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు కాబట్టి నేను సిద్ధం అన్నాను తప్పితే.. సీఎం పదవి అనేది ఒకేసారి వచ్చేది కాదు.. దాని కోసం చాలా కష్టపడాలి. అంచెలు అంచెలుగా ఎదగాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. నిజానికి పవన్ కు సీఎం కావాలని ఉంది. కానీ.. ఆ సీఎం సీటు ఎలా వస్తుందో తెలియదు. సీఎం కావాలంటే ఏం చేయాలో కూడా పవన్ కు తెలియదు. అందుకే ఒక్కోసారి నాకు సీఎం పదవి వద్దు.. గీఎం పదవి వద్దు అంటుంటారు.కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకెళ్లే పదవి అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా అనుభవం ఉండాలి. ముఖ్యమంత్రి పదవి ఊరికే వచ్చేది కాదు. దాని కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. ప్రతి సమస్యపై అవగాహన తెచ్చుకోవాలి.
Pawan Kalyan : ఆ పదవికి అనుభవం కావాలంటున్న పవన్ కళ్యాణ్
సీఎం అని మావాళ్లు అనగానే కాదు కదా.. అందరూ అనుకోవాలి. ప్రజలు కూడా అనుకోవాలి. ప్రజలు అనుకుంటేనే అది జరుగుతుంది.. అంటూ పవన్ చెప్పుకొచ్చినా.. అసలు సీఎం కావాలంటే ఏం చేయాలి.. ఎలా ప్రజల్లోకి వెళ్లాలి అనే విషయాలు పవన్ కు తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు. ఏమో.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ రూట్ ఎటువైపో.. ప్రస్తుతం వారాహి యాత్ర ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నారో.. అధికార వైసీపీ పార్టీపై ఇష్టం ఉన్నట్టుగా బురద జల్లి ఏం సాధిస్తారో చూద్దాం.