Ap Politics : దీ తెలుగు న్యూస్ విశ్లేషణ : ఏపీలో పొత్తు = ఆత్మహత్య ?
Ap Politics : రాజకీయాల్లో పొత్తులు కామనే బాసు. కానీ.. ఆ పొత్తుల వల్ల ఒక్కోసారి కొన్ని పార్టీలకు నష్టం వాటిల్లుతుంది. త్వరలో ఏపీలో అదే జరగబోతోంది అనిపిస్తోంది. నిజానికి.. పొత్తులు అన్ని పార్టీలకు సెట్ కావు. కొన్ని పార్టీలకు పొత్తులు పెద్ద సమస్యలను తీసుకొస్తాయి. ఆ సమస్యలనే రాజకీయ ఆత్మహత్యలు అంటారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ జతకడితే అదే జరగనుంది. అవును.. టీడీపీ, బీజేపీ జతకడితే ఎవరికి లాభం. ఎవరికి నష్టం అనేది స్పష్టం కావడం లేదు. కానీ.. ఇక్కడ పొత్తు అనేది బీజేపీకి కన్నా కూడా టీడీపీకే చాలా ముఖ్యం.
అసలు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. కానీ.. ఈ మూడు పార్టీల పొత్తు ఓకే అవుతుందా? ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించాయి. బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి. కానీ.. అవి పొత్తులో ఉన్నాయా లేదా అనే డౌట్ ఒక్కోసారి కలుగుతోంది. ఈ మూడు పార్టీలు పొత్తుకట్టినా.. నష్టం కలిగేది మాత్రం బీజేపీ, టీడీపీలకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Ap Politics : బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల టార్గెట్ ఒక్కరే?
అసలు బీజేపీ కానీ.. టీడీపీ కానీ.. జనసేన కానీ ఈ మూడు పార్టీల టార్గెట్ ఏంటి.. అంటే టక్కున వచ్చే సమాధానం వైసీపీ ఓటమి. అవును.. సీఎం జగన్ ను ఓడించడమే ఆ పార్టీల కామన్ టార్గెట్. అందుకే కదా.. ఆ పార్టీలు ఒక్కటవ్వాలని ఆశపడేది. అయితే.. ఈ మూడు పార్టీలు కలిసి ఏపీ ప్రజలకు ఏం చెబుతాయి. వైసీపీని ఓడించేందుకే తాము జతకట్టామని చెబుతాయా? అలా చెబితే ఆ కూటమికి ఓట్లు రాలుతాయా? మూడు పార్టీలు కలవడం అది కూడా ఏపీలోని ప్రధాన పార్టీలు.. అంటేనే ఎక్కడో తేడా కొడుతోంది. అది ఆ మూడు పార్టీలలో ఏదో ఒకదానికి తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. మరి.. ఇలాంటి నేపథ్యంలో ఆ మూడు పార్టీల అడుగు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే.