YS Jagan : మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా?? జగన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు చూడండి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా?? జగన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు చూడండి

YS Jagan : మీది ఏపీనా. మీకు ఆరోగ్యశ్రీ (Aarogyasri ) కార్డు ఉందా? అయితే.. ఏపీ ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ జాబితాలోకి ప్రొసీజర్ల చేరిక కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. అయితే.. ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 2446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య ఏకంగా 3254 కు చేరుతుంది. ప్రొసీజన్ల చేరిక కార్యక్రమంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా ఈనెలలోనే ప్రారంభించనున్నారు.తాజాగా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 October 2022,7:00 am

YS Jagan : మీది ఏపీనా. మీకు ఆరోగ్యశ్రీ (Aarogyasri ) కార్డు ఉందా? అయితే.. ఏపీ ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ జాబితాలోకి ప్రొసీజర్ల చేరిక కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. అయితే.. ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 2446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య ఏకంగా 3254 కు చేరుతుంది. ప్రొసీజన్ల చేరిక కార్యక్రమంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా ఈనెలలోనే ప్రారంభించనున్నారు.తాజాగా వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ రివ్యూ చేశారు. క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గురించి వివరించారు. గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుతం అరోగ్యశ్రీ, దాని అనుబంధ సేవల కింద ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోందన్నారు.కేవలం పెరిగిన ప్రొసీజర్లతో సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కోసం సుమారు రూ.2500 కోట్లను ఖర్చు పెడుతోందని సీఎం జగన్ చెప్పారు. ఆరోగ్య ఆసరా కోసం రూ.300 కోట్లు, 108, 104 కోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఇవన్నీ కలిపితే సుమారు రూ.3200 కోట్లను కేవలం ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 వాహనాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే మరికొన్ని 104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

jagan govt good news to ration card holders

jagan govt good news to ration card holders

YS Jagan : ఆరోగ్యశ్రీ కోసమే రూ.2500 ఖర్చు పెడుతున్న ప్రభుత్వం

ప్రస్తుతం ఏపీలో 108 వాహనాలు.. 748 తిరుగుతున్నాయి. అలాగే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ డైట్ చార్జీలను కూడా పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. ఆరోగ్యశ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు పేషెంట్ డైట్ చార్జీలను రూ.100 కు పెంచాలని సీఎం సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన ఆయుష్మాన్ భారత్ అవార్డుల్లో ఆరు అవార్డులు ఏపీకి వచ్చాయని జగన్ కు అధికారులు చెప్పడంతో మొత్తం 10 అవార్డుల్లో ఆరు అవార్డులు ఏపీకే వచ్చాయన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది గుర్తింపు అని ఈసందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది