YS Jagan : మీది ఏపీనా. మీకు ఆరోగ్యశ్రీ (Aarogyasri ) కార్డు ఉందా? అయితే.. ఏపీ ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ జాబితాలోకి ప్రొసీజర్ల చేరిక కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. అయితే.. ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 2446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య ఏకంగా 3254 కు చేరుతుంది. ప్రొసీజన్ల చేరిక కార్యక్రమంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా ఈనెలలోనే ప్రారంభించనున్నారు.తాజాగా వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ రివ్యూ చేశారు. క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గురించి వివరించారు. గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుతం అరోగ్యశ్రీ, దాని అనుబంధ సేవల కింద ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోందన్నారు.కేవలం పెరిగిన ప్రొసీజర్లతో సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కోసం సుమారు రూ.2500 కోట్లను ఖర్చు పెడుతోందని సీఎం జగన్ చెప్పారు. ఆరోగ్య ఆసరా కోసం రూ.300 కోట్లు, 108, 104 కోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఇవన్నీ కలిపితే సుమారు రూ.3200 కోట్లను కేవలం ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 వాహనాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే మరికొన్ని 104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఏపీలో 108 వాహనాలు.. 748 తిరుగుతున్నాయి. అలాగే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ డైట్ చార్జీలను కూడా పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. ఆరోగ్యశ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు పేషెంట్ డైట్ చార్జీలను రూ.100 కు పెంచాలని సీఎం సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన ఆయుష్మాన్ భారత్ అవార్డుల్లో ఆరు అవార్డులు ఏపీకి వచ్చాయని జగన్ కు అధికారులు చెప్పడంతో మొత్తం 10 అవార్డుల్లో ఆరు అవార్డులు ఏపీకే వచ్చాయన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది గుర్తింపు అని ఈసందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.