Janareddy – Etela : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 10తోనే ముగిసింది. నవంబర్ 15 వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే.. తమ నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయో అని నామినేషన్లు వేసిన అభ్యర్థులు తెగ టెన్షన్ పడుతున్నారు. నామినేషన్లలో చిన్న తప్పు ఉన్నా కూడా వెంటనే అధికారులు నామినేషన్ ను రిజెక్ట్ చేస్తారు. దీంతో వాళ్లు మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఉండదు. అలాగే.. వాళ్లు పోటీలో కూడా ఉండరు. 5563 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 2444 అప్లికేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది. కాగా.. మొత్తం 594 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఇందులో కేవలం హైదరాబాద్ లోనే 205 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం నామినేషన్లలో ఎంత మంది ఉపసంహరించుకున్నారు.. చివరకు పోటీలో ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా తెలియదు.
అయితే.. ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన 594 నామినేషన్లలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ భార్య జమున ఉన్నారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి నామినేషన్ వేయగా.. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ వేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కీలక పార్టీలు అయినప్పటికీ.. ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్లను రిజెక్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే.. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా తమ అఫిడవిట్ లో బీఫామ్ సబ్మిట్ చేయలేదట. అందుకే ఎన్నికల అధికారులు వాళ్ల నామినేషన్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది.
నిజానికి హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ వేసినా.. ఈటల జమున కూడా నామినేషన్ వేశారు. నిజానికి ప్రతి ఎన్నికలో ఈటల జమున కూడా నామినేషన్ వేస్తారు. దానికి కారణం.. ఈటల రాజేందర్ నామినేషన్ ఏదైనా కారణం చేత తిరస్కరణకు గురయితే అప్పుడు ఆల్టర్నేట్ గా మరొకరి నామినేషన్ ఉండటం కోసం జమున నామినేషన్ వేస్తారు. అయితే.. ఈసారి ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బీఫామ్ తీసుకున్నారు. అలాగే.. జానారెడ్డి కొడుకు కూడా కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకున్నారు. అందుకే వీళ్లకు బీఫామ్ దక్కకపోవడంతో ఎన్నికల అధికారులు వీళ్ల నామినేషన్లను తిరస్కరించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.