Janareddy – Etela : జానారెడ్డి, ఈటలకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janareddy – Etela : జానారెడ్డి, ఈటలకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్?

Janareddy – Etela : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 10తోనే ముగిసింది. నవంబర్ 15 వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే.. తమ నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయో అని నామినేషన్లు వేసిన అభ్యర్థులు తెగ టెన్షన్ పడుతున్నారు. నామినేషన్లలో చిన్న తప్పు ఉన్నా కూడా వెంటనే అధికారులు నామినేషన్ ను రిజెక్ట్ చేస్తారు. దీంతో వాళ్లు మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఉండదు. అలాగే.. వాళ్లు పోటీలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  జానారెడ్డి నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారు?

  •  ఈటల జమున నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారు?

  •  వాళ్ల నామినేషన్లను తిరస్కరించడానికి కారణాలు ఏంటి?

Janareddy – Etela : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 10తోనే ముగిసింది. నవంబర్ 15 వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే.. తమ నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయో అని నామినేషన్లు వేసిన అభ్యర్థులు తెగ టెన్షన్ పడుతున్నారు. నామినేషన్లలో చిన్న తప్పు ఉన్నా కూడా వెంటనే అధికారులు నామినేషన్ ను రిజెక్ట్ చేస్తారు. దీంతో వాళ్లు మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఉండదు. అలాగే.. వాళ్లు పోటీలో కూడా ఉండరు. 5563 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 2444 అప్లికేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది. కాగా.. మొత్తం 594 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఇందులో కేవలం హైదరాబాద్ లోనే 205 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం నామినేషన్లలో ఎంత మంది ఉపసంహరించుకున్నారు.. చివరకు పోటీలో ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా తెలియదు.

అయితే.. ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన 594 నామినేషన్లలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ భార్య జమున ఉన్నారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి నామినేషన్ వేయగా.. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ వేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కీలక పార్టీలు అయినప్పటికీ.. ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్లను రిజెక్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే.. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా తమ అఫిడవిట్ లో బీఫామ్ సబ్మిట్ చేయలేదట. అందుకే ఎన్నికల అధికారులు వాళ్ల నామినేషన్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది.

Janareddy – Etela : ప్రతి ఎన్నికల్లో ఈటల జమున నామినేషన్లు

నిజానికి హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ వేసినా.. ఈటల జమున కూడా నామినేషన్ వేశారు. నిజానికి ప్రతి ఎన్నికలో ఈటల జమున కూడా నామినేషన్ వేస్తారు. దానికి కారణం.. ఈటల రాజేందర్ నామినేషన్ ఏదైనా కారణం చేత తిరస్కరణకు గురయితే అప్పుడు ఆల్టర్నేట్ గా మరొకరి నామినేషన్ ఉండటం కోసం జమున నామినేషన్ వేస్తారు. అయితే.. ఈసారి ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బీఫామ్ తీసుకున్నారు. అలాగే.. జానారెడ్డి కొడుకు కూడా కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకున్నారు. అందుకే వీళ్లకు బీఫామ్ దక్కకపోవడంతో ఎన్నికల అధికారులు వీళ్ల నామినేషన్లను తిరస్కరించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది