
Army Jawan : పెళ్లైన మూడు రోజులకే ఆర్మీ నుండి పిలుపు.. ఆయన భార్య ఏం చేసిందో తెలుసా ?
Army Jawan : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఐదు రోజుల కిందట (మే 5) ఆయనకు యామిని అనే మహిళతో వివాహమైంది. అయితే. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనోజ్ పాటిల్‌కు ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది.
Army Jawan : పెళ్లైన మూడు రోజులకే ఆర్మీ నుండి పిలుపు.. ఆయన భార్య ఏం చేసిందో తెలుసా ?
పెళ్లి కోసం సెలవులు పెట్టి వచ్చిన జవాన్ మనోజ్ పాటిల్.. ఉన్నతాధికారుల ఆదేశంతో ఉన్నపళంగా బయల్దేరారు. పెళ్లై మూడు రోజులే.. అప్పుడే విధి నిర్వహణ కోసం బోర్డర్‌కు రమ్మంటే యామిని అందుకు ధైర్యంతో పంపింది.భార్య అంటే భర్తలో సగం. . సరిహద్దులో జవాన్ కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తేనే.. యావత్ దేశం సుఖంగా నిద్రపోయేది.యామినీ ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు
మనోజ్‌ను సాగనంపడానికి భార్య యామినితో పాటుగా ఇరువురి కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్‌కు తరలి వచ్చారు. అందరి మనసుల్లో అంతులేని బాధ. కానీ చిరునవ్వుతో మనోజ్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యామిని.. నా సిందూరాన్ని సరిహద్దులకు పంపుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. పెళ్లైన మూడు రోజులకే భర్తను బార్డర్‌కు పంపడానికి నిర్ణయించుకున్న యామినిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మీ దేశభక్తికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.