Army Jawan : పెళ్లైన మూడు రోజుల‌కే ఆర్మీ నుండి పిలుపు.. ఆయ‌న భార్య ఏం చేసిందో తెలుసా.. వీడియో ?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 11, 2025, 10:00 am
  •  Army Jawan : పెళ్లైన మూడు రోజుల‌కే ఆర్మీ నుండి పిలుపు.. ఆయ‌న భార్య ఏం చేసిందో తెలుసా.. వీడియో ?

Army Jawan : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఐదు రోజుల కిందట (మే 5) ఆయనకు యామిని అనే మహిళతో వివాహమైంది. అయితే. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనోజ్ పాటిల్‌కు ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది.

Army Jawan : పెళ్లైన మూడు రోజుల‌కే ఆర్మీ నుండి పిలుపు.. ఆయ‌న భార్య ఏం చేసిందో తెలుసా ?

Army Jawan : పెళ్లైన మూడు రోజుల‌కే ఆర్మీ నుండి పిలుపు.. ఆయ‌న భార్య ఏం చేసిందో తెలుసా ?

Army Jawan నిజంగా గ్రేట్..

పెళ్లి కోసం సెలవులు పెట్టి వచ్చిన జవాన్ మనోజ్ పాటిల్.. ఉన్నతాధికారుల ఆదేశంతో ఉన్నపళంగా బయల్దేరారు. పెళ్లై మూడు రోజులే.. అప్పుడే విధి నిర్వహణ కోసం బోర్డర్‌కు ర‌మ్మంటే యామిని అందుకు ధైర్యంతో పంపింది.భార్య అంటే భర్తలో సగం. . సరిహద్దులో జవాన్ కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తేనే.. యావత్ దేశం సుఖంగా నిద్రపోయేది.యామినీ ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు

మనోజ్‌ను సాగనంపడానికి భార్య యామినితో పాటుగా ఇరువురి కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్‌కు తరలి వచ్చారు. అందరి మనసుల్లో అంతులేని బాధ. కానీ చిరునవ్వుతో మనోజ్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యామిని.. నా సిందూరాన్ని సరిహద్దులకు పంపుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. పెళ్లైన మూడు రోజులకే భర్తను బార్డర్‌కు పంపడానికి నిర్ణయించుకున్న యామినిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మీ దేశభక్తికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp