Justice : ఇలాంటి రూల్స్ సెలబ్రిటీలకేనా.. సామాన్యులకి వర్తించవా...?
Justice : థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన 48 గంటలలోపే బన్నీ బయటకి రావడం చర్చనీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థ, రాజకీయ జోక్యాలు, వివక్షలేని న్యాయం తదితర అంశాలు ఈ చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కొందరు బన్నీని సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం న్యాయస్థానాలని కూడా తప్పుపడుతున్నారు. ‘ఒక తప్పిదానికి అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్టయితే.. కొవిడ్ కాలంలో దారుణాలు, నాణ్యతలేని బ్రిడ్జిల నిర్మాణాలు, రైలు ప్రమాదాలు, అవినీతి విషయంలో మరి రాజకీయ నాయకులపై చర్యలేవని నిలదీశాడు.
Justice : ఇలాంటి రూల్స్ సెలబ్రిటీలకేనా.. సామాన్యులకి వర్తించవా…?
అల్లు అర్జున్ డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టే రాత్రికి రాత్రే బెయిల్ వచ్చేసిందని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఒకే రోజు అల్లు అర్జున్ అరెస్టయ్యాడు, విచారణ జరిగింది, బెయిల్ కూడా లభించింది. న్యాయం మందగమనంలో ఏమీ లేదు,మనం పేదలం అంతే’ అని మరికొందరు అన్నారు. ఇంకొందరు అయితే ఈ విషయంలో రాజకీయ జోక్యాలను ప్రస్తావించారు. ‘రాజకీయ నాయకుల ముందు లీగల్, పోలీస్ డిపార్ట్‌మెంట్లతో ఎలా డ్యాన్స్ చేయించవచ్చునో ప్రపంచానికి రేవంత్‌రెడ్డి చూపారు. బహుశా అసదుద్దీన్ ఒవైసీని మెప్పించేందుకేమో’ అని ఒకరు రాశారు. అయితే ఏ ఒక్కరి షూరిటీ, పైసా జమ చేయకుండా బన్నీని బయటకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.
సామాన్యులకి ఒక రూల్, సెలబ్రిటీలకి ఒక రూలా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తారు. విచారణ జరుగుతుంది. ఒకే రోజులో బెయిల్ కూడా వస్తుంది ఇవేమి రూల్స్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్‌లో వేచి ఉన్నారు. అయితే, రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రైల్ ఖైదీగా(ఖైదీ నంబర్ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచిన విషయం తెలిసిందే.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.