Justice : ఇలాంటి రూల్స్ సెల‌బ్రిటీల‌కేనా.. సామాన్యుల‌కి వ‌ర్తించ‌వా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Justice : ఇలాంటి రూల్స్ సెల‌బ్రిటీల‌కేనా.. సామాన్యుల‌కి వ‌ర్తించ‌వా…?

 Authored By ramu | The Telugu News | Updated on :16 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Justice : ఇలాంటి రూల్స్ సెల‌బ్రిటీల‌కేనా.. సామాన్యుల‌కి వ‌ర్తించ‌వా...?

Justice : థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన 48 గంట‌ల‌లోపే బ‌న్నీ బ‌య‌ట‌కి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థ, రాజకీయ జోక్యాలు, వివక్షలేని న్యాయం తదితర అంశాలు ఈ చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కొంద‌రు బ‌న్నీని స‌పోర్ట్ చేస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం న్యాయస్థానాల‌ని కూడా త‌ప్పుప‌డుతున్నారు. ‘ఒక తప్పిదానికి అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్టయితే.. కొవిడ్‌ కాలంలో దారుణాలు, నాణ్యతలేని బ్రిడ్జిల నిర్మాణాలు, రైలు ప్రమాదాలు, అవినీతి విషయంలో మరి రాజకీయ నాయకులపై చర్యలేవని నిలదీశాడు.

Justice ఇలాంటి రూల్స్ సెల‌బ్రిటీల‌కేనా సామాన్యుల‌కి వ‌ర్తించ‌వా

Justice : ఇలాంటి రూల్స్ సెల‌బ్రిటీల‌కేనా.. సామాన్యుల‌కి వ‌ర్తించ‌వా…?

Justice ఎందుకు ఇలాంటి రూల్స్..

అల్లు అర్జున్‌ డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టే రాత్రికి రాత్రే బెయిల్‌ వచ్చేసిందని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఒకే రోజు అల్లు అర్జున్‌ అరెస్టయ్యాడు, విచారణ జరిగింది, బెయిల్‌ కూడా లభించింది. న్యాయం మందగమనంలో ఏమీ లేదు,మనం పేదలం అంతే’ అని మ‌రికొంద‌రు అన్నారు. ఇంకొంద‌రు అయితే ఈ విషయంలో రాజకీయ జోక్యాలను ప్రస్తావించారు. ‘రాజకీయ నాయకుల ముందు లీగల్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్లతో ఎలా డ్యాన్స్‌ చేయించవచ్చునో ప్రపంచానికి రేవంత్‌రెడ్డి చూపారు. బహుశా అసదుద్దీన్‌ ఒవైసీని మెప్పించేందుకేమో’ అని ఒకరు రాశారు. అయితే ఏ ఒక్క‌రి షూరిటీ, పైసా జ‌మ చేయ‌కుండా బ‌న్నీని బ‌య‌ట‌కు పంపించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

సామాన్యుల‌కి ఒక రూల్‌, సెల‌బ్రిటీల‌కి ఒక రూలా అని కొంద‌రు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తారు. విచారణ జరుగుతుంది. ఒకే రోజులో బెయిల్‌ కూడా వస్తుంది ఇవేమి రూల్స్ అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్‌ బెయిల్‌ పత్రాల కోసం రిసెప్షన్‌లో వేచి ఉన్నారు. అయితే, రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా(ఖైదీ నంబర్‌ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచిన విష‌యం తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది