Telangana Elections Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓట‌మి..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,4:37 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Elections Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓట‌మి..!

  •  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు

Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు , తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దాదాపు ఖ‌రార‌యిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 56 స్థానాల్లో గెలుపు సాధించింది. 9 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 29 స్థానాల్లో గెలిచింది. 10 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 7 స్థానాల్లో గెలిచింది 1 స్థానంలో లీడ్ లో ఉంది. ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచింది. 2 స్థానాల్లో లీడ్ లో ఉంది.

ఇక‌.. ఉద‌యం నుంచి ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన కామారెడ్డి ఓట్ల లెక్కింపులో చివ‌ర‌కు బీజేపీ అభ్య‌ర్థి వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయారు. 3514 ఓట్ల మెజారిటీతో వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి గెలిచారు. కాటిప‌ల్లికి 50294 ఓట్లు వ‌చ్చాయి. రెండో స్థానంలో కేసీఆర్ నిలిచారు.

కేసీఆర్ కు 46780 ఓట్లు పోల‌య్యాయి. రేవంత్ రెడ్డికి 45419 ఓట్లు వ‌చ్చాయి. మొత్తానికి కామారెడ్డి, గ‌జ్వేల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ పోటీ చేయ‌గా.. గ‌జ్వేల్ లో గెలిచి కామారెడ్డిలో ఓడిపోయారు. ఇక‌.. రేవంత్ రెడ్డి కూడా కొడంగ‌ల్, కామారెడ్డిలో పోటీ చేసినా.. కొడంగ‌ల్ లో మాత్రం రేవంత్ గెలిచారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి