Telangana Elections Results 2023 : ఈ విజయం శ్రీకాంతా చారికి అంకితం.. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చుస్తాం: రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : ఈ విజయం శ్రీకాంతా చారికి అంకితం..
ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చుస్తాం: రేవంత్ రెడ్డి
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు సచివాలయం, ప్రగతి భవన్ సామాన్యులకు అందుబాటులో లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఇక నుంచి ప్రగతి భవన్, సచివాలయం గేట్లు సామాన్యుల కోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ ఇక నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుందని.. సామాన్యుల కోసం 24 గంటలు దాని గేట్లు తెరిచే ఉంటాయన్నారు. అవి ప్రజల ఆస్తులని, ప్రజల కోసమే వినియోగిస్తామన్నారు. 2009, డిసెంబర్ 3న తెలంగాణ కోసం శ్రీకాంతా చారి అమరుడయ్యాడని, మళ్లీ 2023, డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని శ్రీకాంతా చారికి అంకితం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గెలిపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు. భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో పేదలను ఆదుకోవడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.
Telangana Elections Results 2023 : కాంగ్రెస్ గెలుపును స్వాగతించిన కేటీఆర్
కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ స్వాగతించారు. బీఆర్ఎస్ కు నా సూచన. తెలంగాణలో నూతన సంప్రదాయానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ముందుకు రావాలి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరించాలన్నారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ గెలిచింది. మానవ హక్కులను కాపాడటంతో కాంగ్రెస్ ముందుంటుంది.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. రాహుల్ గారి మాటను నిలబెడతాం. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ సలహాలు, సూచనలు తీసుకుంటాం. ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ప్రజల ఆదేశాలను సూచనలుగా తీసుకొని అన్ని రకాలుగా ముందుకు వెళ్తాం. . సీపీఐ, సీపీఎం, టీజెఎస్ తో కలిసి ముందుకు వెళ్తాం. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలే నిర్ణయించారు. గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన ఇచ్చింది.
Telangana Elections Results 2023 : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
అదే స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు వెళ్తాం. సోనియా గాందీ, మల్లిఖార్జున ఖర్గేకి నాకు స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంకా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏడున్నర ఏళ్లు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా హోం మంత్రిగా పని చేసిన మాణిక్ రావ్ ఠాక్రే.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ సెక్రటరీలకు ధన్యవాదాలు. నేను పీసీసీ చీఫ్ అవడానికి కీలక పాత్ర పోషించిన మాణికం ఠాగూర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ, కృషి, 30 లక్షల మంది నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరింది. విజయశాంతి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమెకు ధన్యవాదాలు అని రేవంత్ రెడ్డి తెలిపారు.