KCR : కాంగ్రెస్‌ గెలుస్తుందని కేసీఆర్‌కి తెలిసిపోయిందా? కాంగ్రెస్ గెలుపు గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : కాంగ్రెస్‌ గెలుస్తుందని కేసీఆర్‌కి తెలిసిపోయిందా? కాంగ్రెస్ గెలుపు గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. కొన్ని సర్వేలు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెబితే.. మరికొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనేది పక్కన పెడితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా పోటీగా జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొన్నది. బీజేపీ కూడా ఈసారి గెలవాలని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు తెలిసిపోయిందా?

  •  అందుకే.. పదే పదే కాంగ్రెస్ ను కలవరిస్తున్నారా?

  •  సర్వేలు కాంగ్రెస్ వైపే ఉన్నాయా?

KCR : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. కొన్ని సర్వేలు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెబితే.. మరికొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనేది పక్కన పెడితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా పోటీగా జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొన్నది. బీజేపీ కూడా ఈసారి గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది కానీ అది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. ఇక.. బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీనే పావుగా వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. తన ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పేరునే వినిపిస్తున్నారు. దీంతో అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతోంది. కాంగ్రెస్ ఏం చేసింది.. కాంగ్రెస్ ఏం చేయలేదు.. అంటూ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కానీ.. 10 ఏళ్లలో మేం ఏం చేశాం అని చెప్పుకోలేకపోతున్నారు.

బీజేపీ గురించి కంటే కూడా కాంగ్రెస్ గురించే చెబుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏమౌతుందో తెలుసా? అంటూ ఎప్పుడూ కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు కూడా కాంగ్రెస్ గెలుపు గురించే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ మనకు పాత రోజులు వస్తాయని.. మళ్లీ కరెంట్ ఉండదని ప్రజలకు చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ ఆగిపోతాయని చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ఎవరో కాదు.. చంద్రబాబు మనిషి అని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందన్న భయం కల్పించడమే వారి ప్రచార సభల్లో హైలెట్ అవుతోంది. కర్ణాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారని.. అక్కడ హామీలు అమలు చేయడం లేదని కూడా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న కంపెనీలను బెంగళూరుకు తరలించాలని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారని.. కాంగ్రెస్ గెలవకముందే ఇన్ని కుప్పిగంతులు చేస్తే.. ఇక గెలిస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

KCR :  కాంగ్రెస్ ను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారా?

ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు వస్తున్న జోరు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది అని చెబుతున్నారు తప్పితే.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీన్ లేదని మాత్రం చెప్పలేకపోతున్నారు. అంటే.. బీఆర్ఎస్ నేతల్లో ఎక్కడో ఒక చోట ఓటమి భయం పట్టుకుందనే చెప్పుకోవాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది