జనసేన కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుతున్న కొడాలి నాని వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

జనసేన కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుతున్న కొడాలి నాని వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలు నాలుగు దశల్లో పూర్తైన విషయం తెలిసిందే, అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలనే అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వైస్సార్సీపీ మరియు తెలుగుదేశం పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఇక బీజేపీ, జనసేన విషయానికి వస్తే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంటే జనసేన పంచాయితీల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. దీనితో జనసైనికులు సంబరాలు […]

 Authored By brahma | The Telugu News | Updated on :24 February 2021,9:55 am

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలు నాలుగు దశల్లో పూర్తైన విషయం తెలిసిందే, అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలనే అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వైస్సార్సీపీ మరియు తెలుగుదేశం పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఇక బీజేపీ, జనసేన విషయానికి వస్తే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంటే జనసేన పంచాయితీల్లో ఎక్కువ ప్రభావం చూపించింది.

ap local body elections

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. దీనితో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో వాళ్ళకి ఫుల్ జోష్ నింపే వ్యాఖ్యలు చేశాడు మంత్రి కొడాలి నాని తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో, తన నియోజకవర్గంలోని వెణుతురుమిల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మీద గెలిచిన అభ్యర్థి టిడిపి అభ్యర్థి కాదు అని, అక్కడ గెలిచిన అభ్యర్థి జనసేన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు.

టీడీపీ అనుకూల మీడియా లో కొడాలి నానికి టిడిపి అభ్యర్థులు వెణుతురుమిల్లి పంచాయతీ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఆయన మాట్లాడుతూ వెణుతురు మిల్లి లో టిడిపి అసలు అభ్యర్థిని నిలబెట్టలేదని, అక్కడ పోటీ జనసేనకు వైఎస్ఆర్సిపి కి మధ్యలో జరిగిందని, అయితే పవన్ ళ్యాణ్ సామాజికవర్గానికి చెందిన 500 మంది ఓటర్లు గంపగుత్తగా జనసేనకు ఓటు వేయడంతో తమ పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు అని, అక్కడ స్వల్ప మెజారిటీతో గెలిచింది జనసేన అభ్యర్థి అని చెప్పుకొచ్చాడు.

కొడాలి నాని నోటి నుండి ఈ వార్త వినేసరికి జనసైనికుల సంతోషానికి పగ్గలు లేవనే చెప్పాలి. దానికి సంబంధించిన వీడియోకి ఎక్సట్రా మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఒక రకంగా ఆ పార్టీకి కొడాలి నాని వ్యాఖ్యలు బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. మరోపక్క జనసేన పార్టీ అధికారికంగా తమ సోషల్ మీడియా పేజీ లో పంచాయితీ లెక్కలను ప్రకటించింది. సర్పంచులు 1209 చోట్ల సర్పంచు పదవులు, 1576 ఉప సర్పంచ్ , 4456 వార్డులు సాధించి మొత్తం మీద 27 శాతం, ఉభయగోదావరిలో 36 శాతం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 32శాతం ఓట్లు, మిగిలిన 65 శాతం పంచాయితీలలో ద్వితీయ స్థానం. అదేవిధంగా ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు,
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 71 శాతం పంచాయతీలలో ద్వితీయస్థానం సాధించామని చెప్పుకొచ్చింది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది