Kutami : ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్.. ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kutami : ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్.. ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌

Kutami : కొద్ది రోజుల క్రితం వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ని అల్ల‌క‌ల్లోలం చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అప్పుడు ప్ర‌భుత్వం సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆచరణలో జరిగే దానికి పొంతన కుదరడం లేదు.చివరి బాధితుడి వరకు వరద సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా అధికారులు ఎన్యుమరేషన్‌లో చేసిన పొరపాట్లను ఇప్పటికీ సరిదిద్దుకోలేక పరిహారం చెల్లింపులో విఫలం అవుతున్నారు. వరద సాయం అంచనాలు రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యానికి మొత్తంగా కూటమి ప్రభుత్వం మూల్యం […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kutami : ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్.. ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌

Kutami : కొద్ది రోజుల క్రితం వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ని అల్ల‌క‌ల్లోలం చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అప్పుడు ప్ర‌భుత్వం సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆచరణలో జరిగే దానికి పొంతన కుదరడం లేదు.చివరి బాధితుడి వరకు వరద సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా అధికారులు ఎన్యుమరేషన్‌లో చేసిన పొరపాట్లను ఇప్పటికీ సరిదిద్దుకోలేక పరిహారం చెల్లింపులో విఫలం అవుతున్నారు. వరద సాయం అంచనాలు రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యానికి మొత్తంగా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వరద సాయం విడుదలై వారమవుతున్నా ఇప్పటికీ బాధితులకు పరిహారం జమ కాకపోవడంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Kutami ఏం చేస్తున్నారు..

97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఎన్యుమరేషన్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమర్పించినా ఫలితం లేదన్నారు. టీడీపీ నేతలు సచివాలయాలలో కూర్చొని అర్హులను ఎంపిక చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22,185 మందికి నేటికీ కనీస సాయం అందలేదని చెప్పారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వరద హెచ్చరికలు జారీచేయటంతో పాటు బాధితులకు సాయం అందించటంలోనూ ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. కేంద్రానికి రూ. 7 వేల కోట్ల నివేదిక పంపి.. చివరకు అరకొర సాయంగా రూ. 600 కోట్లు విదిల్చారని మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.

Kutami ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్ ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌

Kutami : ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్.. ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌

బ్యాంక్ అంకౌట్ తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఒక‌ప్పుడు వాలంటీర్ వ్య‌వ‌స్థ ఉండ‌డంతో ఏ విష‌యాన్నైన వారిని అడ‌గ‌డానికి ఉండేది. ఇప్పుడు ఎవ‌రిని అడ‌గాలో అర్ధం కావ‌డం లేదు అని ల‌బోదిబోమంటున్నారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయ‌కులు ధ్వజమెత్తారు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది