Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అధికార కూటములదే హవా..!
ప్రధానాంశాలు:
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అధికార కూటములదే హవా..!
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఆ రెండు రాష్ట్రాలలో ఎవరు అధికారంలోకి వస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఆదివాసీల అడ్డాలో గెలిచేదెవరు? మరాఠా అధికార పీఠంపై కూర్చునేది ఎవరు? దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఈసారి అధికారం ఎవరిదనేది తేలిపోయింది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికార కూటములకే అవకాశం దక్కాయి. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో జార్ఖండ్ లో జేఎంఎం పార్టీ నేతృత్వంలోని కూటమికి విజయం దక్కనుండగా.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటికి విజయం ఖరారైంది.
Maharashtra Jharkhand Election Results 2024 వారికే అధికారం..
ఎవరికి ఎన్ని స్థానాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫలితాలతో బీజేపీ జోష్ లో ఉండగా.. కాంగ్రెస్ కు మాత్రం కొంత మోదం ఖేదం వంటి పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో మొత్తం 66.05 శాతం ఓటింగ్ నమోదైంది, ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ నుంచి 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్‌డీఏ మిత్రపక్షం శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేసాయి. మహారాష్ట్ర (మొత్తం స్థానాలు 288) కాగా, బీజేపీ మహాయుతి కూటమి: 223, మహాఘట్‌బంధన్ కూటమి: 47, ఇతరులు: 18. ఇక జార్ఖండ్ (మొత్తం 81) కాగా, జేఎంఎం పార్టీ కూటమి: 51, బీజేపీ: 30, ఇతరులు: 0
గతంలో కన్నా అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని మహాయుతి కూటమి మహారాష్ట్రలో తిరిగి అధికారం సొంతం చేసుకుంది. ఫలితాలు స్పష్టంగా తెలియడంతో ప్రమాణస్వీకారానికి బీజేపీ నేతృత్వంలోని కూటమి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం. అయితే సీఎంగా ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఏక్‌నాథ్ షిండేకు తిరిగి అవకాశం ఇస్తారా? లేదంటే మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా అనేది ఉత్కంఠ నెలకొంది.