Roja : రేయ్.. ముసలి నా కొడకా బండ.. ఆడవాళ్ల జోలికొస్తే ఈ భూమి మీద ఉండవ్.. రోజా సినిమా స్టైల్ వార్నింగ్ అదుర్స్
Roja : ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అక్రమం అంటూ టీడీపీ నేతలు ఓవైపు నిరసన తెలుపుతుంటే మరోవైపు వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సక్రమమే అని.. ఆయనకు తగిన శాస్త్రి జరిగిందని అంటున్నారు. ఇక.. వైసీపీ మంత్రి రోజా అయితే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో స్పందించారు. నిజమైన మహాత్మా గాంధీ వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లడం, ఆ పార్టీలో మేము మంత్రిగా ఉండటం మా అదృష్టం. అదే సమయంలో ఎన్టీఆర్ గారు చెప్పారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అని చంద్రబాబు గురించి. గాడ్సే కన్నా ఘోరమైన చంద్రబాబు ఈరోజు జైలులో తాను తప్పు చేసి ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాదారాలతో అరెస్టయి జైలులో కూర్చొని తానేదో త్యాగం చేసినట్టు తనదేదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈరోజు జైలులో ఆయన నిరాహార దీక్ష చేయడం, బయట ఆయన భార్య చేయడం చూస్తే మహాత్మా గాంధీ గారిని అవమానించినట్టే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
మహాత్మా గాంధీ లాంటి వాళ్లు అందరూ కూడా నిస్వార్థంగా దేశ ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారు. ఎన్నో పోరాటాలను అహింసా మార్గంలో చేశారు. కానీ.. చంద్రబాబు జీవితమే హింసా మార్గం. పిల్లనిచ్చిన తండ్రి లాంటి ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత వంగవీటి రంగా గారి విషయం మీకు తెలుసు. అలా చెప్పుకుంటే పోతే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఎలా వేధించారో మనకు తెలుసు. హింసా మార్గంలో వెళ్లిన చంద్రబాబు ఈరోజు నిరాహార దీక్ష చేయడం అనేది ఎక్కడా సింపతీ కాదు.. అసహ్యించుకుంటున్నారు. మొన్న మీరు చూశారు.. పల్లాలు కొట్టడం, విజిల్స్ వేయడం లాంటి చిల్లర చేష్టలు చేశారు. నిజంగా మాకు కోటికి పైగా సభ్యత్వం ఉంది అని అంటారు కదా. మరి ఆ కోటి మంది ఎక్కడికెళ్లారు. నిజంగా చంద్రబాబుకు అన్యాయం జరిగి ఉంటే.. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఉంటే.. ఆ కోటి మంది బయటికి వచ్చి ఎందుకు నిరసన తెలియజేయలేదు అంటూ రోజా మండిపడ్డారు.
Roja : 15 సీట్లలో జనసేన అభ్యర్థులను నిలిపితే చాలు
మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఈరోజు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ప్రజలెవ్వరు కూడా మీరు చేస్తున్న ఈ చిల్లర చేష్టలను కానీ.. ఈ దొంగ చేసే దీక్షలను ప్రజలెవ్వరూ స్వాగతించడం లేదు. మహాత్మా గాంధీని అవమానించే విధంగా ఈరోజు చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే.. పవన్ కళ్యాణ్ 15 సీట్లకు జనసేన అభ్యర్థులను పెట్టుకుంటే చాలు. వైసీపీకి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు రెడీగా ఉన్న పార్టీ. ఏ సమయంలో అయినా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు జనసేనకు పోటీ చేయడానికి టీడీపీ కావాలి.. టీడీపీకి జనసేన కావాలి. సన్యాసి, సన్యాని రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప.. ఇంకేం రాలదు అనేది జనసేన, టీడీపీ తెలుసుకోవాలి. ఈరోజు జగన్ పక్కన జనం ఉన్నారు. జగన్ పాదయాత్రలో ఏం ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈ రోజు హామీ ఇవ్వనివి కూడా చాలా పథకాలు అమలు చేశారు అని రోజా స్పష్టం చేశారు.