Mukesh Ambani : అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఈ మధ్య తన కొడుకు పెళ్లిని అట్టహాసంగా జరిపి వార్తలలో నిలిపారు. తన ఆస్తులలో 0.5 శాతం ఖర్చు చేసి కుమారుడి పెళ్లి చేశారు. ఆయన కుమారుడి పెళ్లికి అతిరథ మహారధులు హాజరు కాగా, వారి కోసం భారీ ఏర్పాట్లే చేశారు. అయితే ఇక వారి ఇంట్లో పనిచేసే వారి జీతభత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకోవల్సిందే! టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎక్కువని టాక్.
ఇంతకీ ప్రపంచకుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? వారి జీతభత్యాలు ఏంటనేది చూస్తే.. ముకేష్ అంబాని ఆంటిలియా భవనంలో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారట. ఒక రిపోర్ట్ ప్రకారం.. అంబానీ వంట మనిషి జీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కొక్కరికి రూ. 2 లక్షలపైనే జీతం ఇస్తారట. ఇక తన షెఫ్‌లకు కూడా నెలకు రూ. 2 లక్షల జీతం అని పలు మీడియా కథనాల ద్వారా తెలిసింది. అంటే ఏడాదికి రూ. 24 లక్షల ప్యాకేజీ అన్నట్లు లెక్క. ఈ ఇంట్లో దాదాపు సిబ్బంది అందరికీ ఇదే జీతం ఉంటుందంట. అంబానీ తన సిబ్బందికి ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు.
24/7 తన ఇంట్లోనే వసతి ఏర్పాటు, బీమా, పిల్లలకు ట్యూషన్ ఫీజులు కూడా అందిస్తున్నారట. ఇక అంబానీ ఇంట్లో పనిచేసేవారికి ఎలాంటి నైపుణ్యాలున్నాయో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక అంబాని డైట్ చాలా పద్దతిగా ఉంటుంది. ఎక్కువగా చపాతీ, పప్పు, అన్నం తింటారట. రోడ్ సైడ్ స్టాల్/కెఫే అయినా తింటారట. ఎక్కువగా థాయ్ వంటకాలంటే అంబానీకి ఇష్టమంట. ఇక ఆదివారం తన అల్పాహారంలో ఇడ్లీ- సాంబార్ ఉండాల్సిందేనట.ఇక ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ వయసులోనూ అందంగా ఉంటారు. దీని వెనుక మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు మిక్కీ కాంట్రాక్టరే. నీతా అంబానీకి, ఆయన కుటుంబానికి ఆమె మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తుంటారు. వారికి బాగానే ఇస్తారట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.