Mukesh Ambani : బాబోయ్.. అంబాని ఇంట్లో ప‌ని చేసే వాళ్ల‌కి అంత జీతం ఇస్తారా.. సాఫ్ట్ వేర్ జాబ్ క‌న్నా ఇది మేలు కదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mukesh Ambani : బాబోయ్.. అంబాని ఇంట్లో ప‌ని చేసే వాళ్ల‌కి అంత జీతం ఇస్తారా.. సాఫ్ట్ వేర్ జాబ్ క‌న్నా ఇది మేలు కదా..!

Mukesh Ambani : అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీ ఈ మ‌ధ్య త‌న కొడుకు పెళ్లిని అట్ట‌హాసంగా జ‌రిపి వార్త‌ల‌లో నిలిపారు. త‌న ఆస్తుల‌లో 0.5 శాతం ఖ‌ర్చు చేసి కుమారుడి పెళ్లి చేశారు. ఆయ‌న కుమారుడి పెళ్లికి అతిర‌థ మ‌హార‌ధులు హాజ‌రు కాగా, వారి కోసం భారీ ఏర్పాట్లే చేశారు. అయితే ఇక వారి ఇంట్లో పనిచేసే వారి జీతభత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Mukesh Ambani : బాబోయ్.. అంబాని ఇంట్లో ప‌ని చేసే వాళ్ల‌కి అంత జీతం ఇస్తారా.. సాఫ్ట్ వేర్ జాబ్ క‌న్నా ఇది మేలు కదా..!

Mukesh Ambani : అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీ ఈ మ‌ధ్య త‌న కొడుకు పెళ్లిని అట్ట‌హాసంగా జ‌రిపి వార్త‌ల‌లో నిలిపారు. త‌న ఆస్తుల‌లో 0.5 శాతం ఖ‌ర్చు చేసి కుమారుడి పెళ్లి చేశారు. ఆయ‌న కుమారుడి పెళ్లికి అతిర‌థ మ‌హార‌ధులు హాజ‌రు కాగా, వారి కోసం భారీ ఏర్పాట్లే చేశారు. అయితే ఇక వారి ఇంట్లో పనిచేసే వారి జీతభత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకోవ‌ల్సిందే! టాప్​ మల్టీనేషనల్​ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగుల కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎక్కువని టాక్​.

Mukesh Ambani బాబోయ్ మ‌రీ అంత‌నా..

ఇంతకీ ప్రపంచకుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? వారి జీతభత్యాలు ఏంట‌నేది చూస్తే.. ముకేష్ అంబాని ఆంటిలియా భవనంలో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారట. ఒక రిపోర్ట్ ప్రకారం.. అంబానీ వంట మనిషి జీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కొక్కరికి రూ. 2 లక్షలపైనే జీతం ఇస్తారట. ఇక తన షెఫ్‌లకు కూడా నెలకు రూ. 2 లక్షల జీతం అని పలు మీడియా కథనాల ద్వారా తెలిసింది. అంటే ఏడాదికి రూ. 24 లక్షల ప్యాకేజీ అన్నట్లు లెక్క. ఈ ఇంట్లో దాదాపు సిబ్బంది అందరికీ ఇదే జీతం ఉంటుందంట. అంబానీ తన సిబ్బందికి ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు.

Mukesh Ambani బాబోయ్ అంబాని ఇంట్లో ప‌ని చేసే వాళ్ల‌కి అంత జీతం ఇస్తారా సాఫ్ట్ వేర్ జాబ్ క‌న్నా ఇది మేలు కదా

Mukesh Ambani : బాబోయ్.. అంబాని ఇంట్లో ప‌ని చేసే వాళ్ల‌కి అంత జీతం ఇస్తారా.. సాఫ్ట్ వేర్ జాబ్ క‌న్నా ఇది మేలు కదా..!

24/7 తన ఇంట్లోనే వసతి ఏర్పాటు, బీమా, పిల్లలకు ట్యూషన్ ఫీజులు కూడా అందిస్తున్నారట. ఇక అంబానీ ఇంట్లో పనిచేసేవారికి ఎలాంటి నైపుణ్యాలున్నాయో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక అంబాని డైట్ చాలా ప‌ద్ద‌తిగా ఉంటుంది. ఎక్కువగా చపాతీ, పప్పు, అన్నం తింటారట. రోడ్ సైడ్ స్టాల్/కెఫే అయినా తింటారట. ఎక్కువగా థాయ్ వంటకాలంటే అంబానీకి ఇష్టమంట. ఇక ఆదివారం తన అల్పాహారంలో ఇడ్లీ- సాంబార్ ఉండాల్సిందేనట.ఇక ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ వయసులోనూ అందంగా ఉంటారు. దీని వెనుక మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభ కూడా ఉంది. ఆమె ఎవ‌రో కాదు మిక్కీ కాంట్రాక్టరే. నీతా అంబానీకి, ఆయన కుటుంబానికి ఆమె మేకప్ ఆర్టిస్టు‌గా పనిచేస్తుంటారు. వారికి బాగానే ఇస్తార‌ట‌.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది