
Rythu Bima : రైతులకి అలర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివరి గడువు
Rythu Bima : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ది, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రేవంత్ సర్కార్ మొత్తం బడ్జెట్ రూ.2,91,159 కోట్లుగా వుంటే అందులో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఏకంగా రూ.72,659 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తక్కువ ఉత్పాదకత కారణంగా తరచుగా సంభవించే కరువు కారణంగా రైతుల ఆదాయం తగ్గుతోంది. మెజారిటీ రైతులు వీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు ఆర్థిక , సామాజిక భద్రతను నిర్ధారించడానికి, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఇతర కార్యక్రమాలతో పాటు రైతు సమూహ జీవిత బీమా పథకం (రైతు బీమా) పేరుతో 2018 లో కేసీఆర్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని రూపొందించింది.
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. బీమా మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లో ఈ పథకం లబ్ధి అందుతుంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,271 చొప్పున చెల్లించగా గత ఏడాది రూ.3,556 చొప్పున చెల్లించింది.కొత్త పట్టాదారు రైతులు 2024 జులై 28వ తేదీ వరకు పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఇప్పటివరకు రైతు బీమా చేసుకోలేకపోయిన రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలని పేర్కొంది.
Rythu Bima : రైతులకి అలర్ట్.. రైతుభీమా దరఖాస్తులకు నేడు చివరి గడువు
ఎల్ఐసీకి మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,271 చొప్పున చెల్లించగా గత ఏడాది రూ.3,556 చొప్పున చెల్లించింది. అర్హత కలిగిన రైతులు ఏఈవో కు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తు ఫారం తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు నామీని యొక్క ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది.
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
This website uses cookies.