Mynampally Rohit Rao : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాం.. మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యలకు బిత్తరపోయిన జనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mynampally Rohit Rao : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాం.. మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యలకు బిత్తరపోయిన జనం

Mynampally Rohit Rao : మైనంపల్లి రోహిత్ రావు తెలుసు కదా. మైనంపల్లి హన్మంత రావు కొడుకు. మెదక్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మైనంపల్లి హన్మత రావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలుసు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చినా కూడా తన కొడుకుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి మంత్రి హరీశ్ రావుపై ఆరోపణలు చేసి మరీ హన్మంత రావు కాంగ్రెస్ లో చేరారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 November 2023,10:34 pm

ప్రధానాంశాలు:

  •  మైనంపల్లి రోహిత్ మాట్లాడిన వీడియో వైరల్

  •  రోజుకు 48 గంటలు కరెంట్ ఇస్తాం అన్న రోహిత్

  •  ఆడేసుకుంటున్న నెటిజన్లు

Mynampally Rohit Rao : మైనంపల్లి రోహిత్ రావు తెలుసు కదా. మైనంపల్లి హన్మంత రావు కొడుకు. మెదక్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మైనంపల్లి హన్మత రావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలుసు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చినా కూడా తన కొడుకుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి మంత్రి హరీశ్ రావుపై ఆరోపణలు చేసి మరీ హన్మంత రావు కాంగ్రెస్ లో చేరారు. దీంతో హన్మంత రావుకు మల్కాజిగిరి నుంచి, ఆయన కొడుకు రోహిత్ రావుకు కాంగ్రెస్ అధిష్ఠానం మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చింది. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోహిత్ రావు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోనే మకాం వేశారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

తాజాగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోంది కదా. అదే విధంగా చేయి గుర్తు ప్రభుత్వం వచ్చినంక అవసరమైతే రోజుకు 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా కరెంట్ ఇస్తం. అంటే అట్లాంటోళ్లం మేము. అట్లాంటోళ్లం. ఇప్పుడు ఉండేదాని కన్నా అవసరం ఉంటే, నిజంగా అవకాశం ఉంటే రోజుకు 24 గంటలు ఉంటే ఒక గంట ఎక్కువే ఇస్తం తప్ప తక్కువ ఇవ్వం.. అంటూ మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశాడు.

Mynampally Rohit Rao : రోహిత్ వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్

తాజాగా రోహిత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడిని వెంటనే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చూపించండిరా బాబు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అరెయ్.. అన్ ఎడ్యుకేటెడ్ ఫూల్.. ఏం మాట్లాడుతున్నావురా.. అందుకే చదువుకోండి ఫస్ట్.. చదువుకోకుండా పరీక్షలు రాస్తే ఇలానే ఉంటది రిజల్ట్ అంటూ రోహిత్ ను ట్రోల్ చేస్తున్నారు.

 

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది