
nara bhuvaneswari serious look on kodali nanai and roja
Nara Bhuvaneshwari : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ నేతలు కావాలని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ పార్టీ కార్యక్రమాలన్నీ మరుగున పడిపోయాయి. దీంతో నారా భువనేశ్వరి ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. తాజాగా నారా భువనేశ్వరి తిరుమలకు వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవడానికి కొందరు టీడీపీ మహిళా నేతలతో కలిసి భువనేశ్వరి తిరుమలకు వెళ్లారు. భువనేశ్వరి తిరుమలలో అడుగుపెట్టగానే భక్తులు గుమికూడారు. తనను చూడటం కోసం ఎగబడ్డారు. దీంతో భక్తులను పక్కకు తప్పించేందుకు సెక్యూరిటీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అదే అదే రోజు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి రోజా కూడా అదే రోజు తిరుమలకు వచ్చారు. మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల నుంచి బయటికి వచ్చారు. అయితే.. ముగ్గురూ ఒకేసారి తిరుమలను దర్శించుకోవడంతో ముగ్గురూ ఒకసారి తిరుమల బయట తారసపడ్డారు. కొడాలి నాని, రోజా అంటే ఒకటే పార్టీ కాబట్టి.. వాళ్లు తరుచూ కలుసుకుంటారు కాబట్టి పెద్దగా వాళ్లు ఇద్దరూ కలిసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేనప్పటికీ.. భువనేశ్వరిని ఇద్దరూ చూసి షాక్ అయ్యారు. వెంటనే రోజా అయితే.. నమస్తే అక్క అంటూ నమస్కారం పెట్టింది. ఇక.. కొడాలి నాని అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య మంత్రి అయినప్పటి నుంచి రోజా తరుచూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కనీసం వారానికి ఒకసారి అయినా రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వీలు కుదిరినప్పుడల్లా ఆమె శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. ఏది ఏమైనా రోజా, భువనేశ్వరి ఒకేసారి తారసపడటంతో అక్కడ ఉన్న భక్తులు కూడా షాక్ అయ్యారు. ఇటీవలే వంగవీటి రాధ పెళ్లిలో పవన్ కళ్యాణ్, కొడాలి నాని ఇద్దరూ తారసపడిన విషయం తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ను చూసి కొడాలి నాని దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వీళ్లంతా కేవలం మీడియా ముందు, సోషల్ మీడియాలో శత్రువుల్లా తిట్టుకుంటారు కానీ.. ఫేస్ టు ఫేస్ మాత్రం అస్సలు తిట్టుకోరు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.