Nara Bhuvaneswari : లోకేష్ ఎలా పుట్టాడు.. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే.. భువనేశ్వరి మాస్ వార్నింగ్
Nara Bhuvaneswari : ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు చాలాసార్లు చంద్రబాబు ఫ్యామిలీపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ ఎలా పుట్టాడు అంటూ కొందరు సభ్యులు చాలా అసభ్యంగానూ ప్రవర్తించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయింది. అప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ పరువును ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు తీశారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఫ్యామిలీనే రోడ్డు మీదికి వచ్చేలా చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన భార్య భువనేశ్వరి రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నారా బ్రాహ్మణి కూడా తన అత్త భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు జరిగింది నేను ఎప్పుడూ మరిచిపోను. ఏంటి నా మీద చూపిస్తారు. నేను అట్లాంటిదాన్ని.. ఇట్లాంటిదాన్ని అని. నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరే వాళ్లు ఎంత వాగినా కూడా అది మనకు అనవసరం. ఇక్కడుండే స్త్రీలకు కూడా ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను.
మగాడు ఏదైనా మాట్లాడుతాడు. పని లేని వాళ్లు ఏదైనా మాట్లాడుతారు. వాళ్లు మరిచిపోతున్నారు. ఒక ఆడది తల్లి, భార్య అని. ఒక సృష్టికి మూలకర్త ఆడది అని వాళ్లు మరిచిపోయారు. అలాగే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అన్ని రకాల, వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు గారికి మీరు ఇచ్చిన బలం కుటుంబంలా కూడా మరిచిపోలేం. మీరందరూ శాంతియుతంగా ఉండాలి. మనమంతా కలిసి పోరాడుదాం. యువగళం యాత్ర జనరేషన్ యూత్ కోసం. వాళ్లకు ముందు ఎట్లా చేస్తే బాగుంటుందని పాదయాత్ర స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందండి.. ఆయన యువగళం చేసే వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లిపోయారు. అయినా కూడా తన పాదయాత్రను కొనసాగించారు. ఎంత ఆపినా ఏది ఆగదు. మనమందరం ముందుకెళ్తాం. చేయి చేయి కలిపి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలి అని భువనేశ్వరి అన్నారు.
Nara Bhuvaneswari : నిరసన తెలుపుతున్న మహిళలపై అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెడుతున్నారు
తోట సీతామహలక్ష్మీ గారు ఆసుపత్రిలో ఉంటే ఆమె మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టారు. ఆమెకు 70 ఏళ్లు. ఆమె ఈ వయసులో హత్య చేస్తుందా? ఒక్కరిని కాదు.. చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో మహిళలు నిరసన చెబుతుంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు. వాళ్లను కూడా తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు. అరెస్ట్ చేశారు. నేను కోరేది ఒక్కటే. మీరు ఇవన్నీ ఆయన చేసిన కృషిని గుర్తించాలి. రేపు మన జీవితం ఏంటి.. ఉపాధి కలుగుతుందా లేదా? ఏంది మన ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ధైర్యంగా ముందుకు వచ్చి మీ ఓటు వేయాలి.. అని భువనేశ్వరి కోరారు.