Nara Lokesh : మా అమ్మ మీద ఒట్టు.. ఎవ్వరినీ వదిలిపెట్టను.. పాపం స్పీచ్ మధ్యలోనే ఏడ్చేశాడు నారా లోకేష్
Nara Lokesh : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ కావాలని చంద్రబాబును అరెస్ట్ చేయించారని నారా లోకేష్ పలుమార్లు విమర్శలు చేశారు. తాజాగా సీఎం జగన్ పై నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి ఏనాడూ ఆలోచించలేదు కానీ.. పేదవాళ్లు శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలని పని చేసిన వ్యక్తి చంద్రబాబు. జగన్.. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న విధ్వంసం జరుగుతోంది. ప్రజలందరూ ఆలోచించాలి. ఈ సైకో జగన్ తీసుకున్న మొదటి నిర్ణయం.. ప్రజల కోసం కట్టిన ప్రజా వేదిక కూల్చడం. అక్కడి నుంచి ఆనాడు టీడీపీ కార్యకర్తలను గ్రామాల నుంచి బహిష్కరిస్తే.. ఆ గ్రామాలకు చంద్రబాబు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఆయన గేటుకు తాడు కట్టిన సైకో ఈ జగన్ అని మండిపడ్డారు.
ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడితే ప్రజలంతా అనుకున్నారు మనకెందుకులే అని. అదే సైకో జగన్.. దళితులపైన కేసులు పెట్టాడు. బీసీలపైన కేసులు పెట్టాడు. ఏకంగా మైనార్టీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయా? అనేక మంది టీడీపీ పార్టీ నాయకులపైన వేలాది కేసులు పెట్టారు. టీడీపీ పార్టీ కార్యకర్తలపైన లక్షలాది కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మన కుటుంబం పైన దాడి చేస్తున్నాడు ఈ సైకో జగన్. నేనే సీఐడీ ఇన్వెస్టిగేషన్ కు వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లిపైన కూడా కేసు పెడతామని బెదిరించడం జరిగింది.. అని నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.
Nara Lokesh : ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా?
ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తప్ప ఏ అధికారిక కార్యక్రమానికి కూడా మా అమ్మ వచ్చిందా? అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. చాలా బాధేస్తోంది. సేవా కార్యక్రమాలు తప్ప ప్రజలకు కూడా సేవ చేయాలన్న ఆలోచన తప్ప, ఏనాడూ మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవ్వలేదు. ఏనాడూ గవర్నర్ ను కలవడానికి కూడా వెళ్లలేదు. అలాంటి తల్లిపై శాసనసభ సాక్షిగా ఈసైకో జగన్, ఆయన సైన్యం అవమానించారు అని నారా లోకేష్ ఏడ్చేశారు.