Pass Book : ప్రస్తుతం ఏపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రూ. 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ క్యాబినేట్ ఓ నిర్ణయం తీసుకుంది.
ప్రజాధనం దుర్వినియోగం చేసి రూ. వందల కోట్ల ఖర్చుతో మాజీ సీఎం 75 లక్షల సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలని మంత్రవర్గం నిశ్చయించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ . ఈనెల 20 నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు . మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేపడుతామన్నారు. పైలెట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామసభలు పెట్టి క్యూ ఆర్ కోడ్‌తో పాస్ బుక్ లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
Cherlapally Railway Terminal : అత్యాధునికమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ pm modi సోమవారం ప్రారంభించారు.…
First HMPV Cases In India : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ HMPV కేసులపై భారత ప్రభుత్వం నిశితంగా…
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan తనయుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా నెట్టింట…
Eat Spinach : పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకోసమే ఆరోగ్య నిపుణులు పాలకూరను తరచూ తినాలని చెబుతుంటారు. ఇక…
Gautam gambhir : సమష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినట్టు గంభీర్ తాజాగా చెప్పుకొచ్చారు.…
Cooking Oils : మీ ఇంట్లో వంట తయారీకి ఈ నూనెను వినియోగిస్తున్నారా...అయితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా…
Honey Rose : మలయాళ కథానాయిక హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలయ్య సినిమా వీరసింహారెడ్డితో మంచి…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. ఆయన తాజాగా…
This website uses cookies.