Pass Book : కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పుస్తకాలు..
ప్రధానాంశాలు:
Pass Book : కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పుస్తకాలు..
Pass Book : ప్రస్తుతం ఏపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రూ. 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ క్యాబినేట్ ఓ నిర్ణయం తీసుకుంది.
Pass Book : క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పుస్తకాలు..
ప్రజాధనం దుర్వినియోగం చేసి రూ. వందల కోట్ల ఖర్చుతో మాజీ సీఎం 75 లక్షల సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలని మంత్రవర్గం నిశ్చయించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ . ఈనెల 20 నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు . మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేపడుతామన్నారు. పైలెట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామసభలు పెట్టి క్యూ ఆర్ కోడ్‌తో పాస్ బుక్ లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.