Ind vs Aus : భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం ఆట ప్రారంభించిన కంగారూ జట్టు వెంటవెంటనే వికెట్లని కోల్పోయింది. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న బ్యూ వెబ్‌స్టర్ అత్యధిక స్కోరు 57 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ తలో 2 వికెట్లు తీశారు.
అయితే ఈ మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా రిషబ్ పంత్ అటాకింగ్ గేమ్‌తో అదరగొట్టాడు. 33 బంతుల్లో 61 పరుగులు చేసాడు. ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్స్‌కి చుక్కలు చూపించాడు. అయితే కమ్మిన్స్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని తప్పుగా అంచనా వేసి ఔట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ ఔటైన తీరు విమర్శలు గుప్పించేలా చేస్తుంది. ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. 12 బంతులాడి ఓ బౌండరీ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 9 ఇన్నింగ్స్‌లు ఆడగా.. 8 సార్లు ఔటయ్యాడు. ఒకసారి అజేయ శతకంతో నిలిచాడు. ఈ 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే పెవిలియన్ చేరాడు.
Cherlapally Railway Terminal : అత్యాధునికమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ pm modi సోమవారం ప్రారంభించారు.…
First HMPV Cases In India : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ HMPV కేసులపై భారత ప్రభుత్వం నిశితంగా…
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan తనయుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా నెట్టింట…
Eat Spinach : పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకోసమే ఆరోగ్య నిపుణులు పాలకూరను తరచూ తినాలని చెబుతుంటారు. ఇక…
Gautam gambhir : సమష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినట్టు గంభీర్ తాజాగా చెప్పుకొచ్చారు.…
Cooking Oils : మీ ఇంట్లో వంట తయారీకి ఈ నూనెను వినియోగిస్తున్నారా...అయితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా…
Honey Rose : మలయాళ కథానాయిక హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలయ్య సినిమా వీరసింహారెడ్డితో మంచి…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరే లెవల్లో ఉంటుంది. ఆయన తాజాగా…
This website uses cookies.