Ration Cards : మీకో గుడ్ న్యూస్.. మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు జారీ… అప్లై చేసి విధానం…!
ప్రధానాంశాలు:
Ration Cards : మీకో గుడ్ న్యూస్.. మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు జారీ... అప్లై చేసి విధానం...!
Ration Cards : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సాధ్యసాధ్యలను పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరిట ఐదు గ్యారంటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటికి రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపే సమాచారం. ఆరోగ్యానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలామంది వీటికే అప్లై చేసుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్కసారి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేసిన పెండింగ్ దరఖాస్తులు చాలా ఉన్నాయి. వాటి ఆమోదం కోసం దరఖాస్తుదారులు ఎదురు చూశారు. తర్వాత ప్రభుత్వం మారటంతో రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ అటకెక్కింది. మళ్లీ కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తుంది. కొత్త రేషన్ కార్డులను తమ కచ్చితంగా ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ 16 వార్డులు జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయాసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు లేని వారు ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునేలా చూడాలన్నారు.
ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఉంటే అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాలన్నారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ జర్నీ పథకం, రాజవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల కు పెంపు అమలు చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి తప్పకుండా వాళ్లకు రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు… అలాగే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను ఫిబ్రవరి నెల ఆఖరిలోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. రాష్ట్రంలోని మధ్యతరగతి, పేద, ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.