new-surveys-in-andhra-politics-once-again-jagan-will-win
AP Survey : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసిపి పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వారి అభ్యర్థులను మార్చుతూ సంచలనాలకు తెరదించండి. అయితే ఇప్పటికే అధికార పార్టీ వైసిపి నాలుగు జాబితాలను ప్రకటించగా దానిలో ఇప్పటికీ 50 మంది అభ్యర్థులను మార్చింది. అలాగే మరో 20 మందిని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే భీమిలి నుండి ఎన్నికల ప్రచారాలను ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అదేవిధంగా చంద్రబాబు “రా కదలిరా ” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున రాష్ట్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల గెలుపుపై అన్ని పార్టీలలో కూడా ధీమా కనిపిస్తుంది.
మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని అందుకే వైసిపి పార్టీ ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అంచనాలు వేస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేశామని కాబ్బటి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ధీమా కనబరుస్తుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో గెలుపు ఎవరిదనే అంచనాలు వేయడం చాలా కష్టంగా మారింది అని చెప్పాలి.ఇలాంటి తరుణంలోనే జాతీయ మీడియా సంస్థలు మరియు ఫ్రీ పోల్ సర్వేలు చేపట్టే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.అయితే గత కొంతకాలంగా సర్వేలను నిర్వహిస్తున్న మూడు సంస్థలు వారి సర్వేలను తాజాగా వెల్లడించాయి. ఇక ఈ మూడు సంస్థల ఫలితాలు చాలా దగ్గరగా ఉండడం విశేషం అని చెప్పాలి.అయితే ఈ సంస్థలు మరోసారి వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చి చెప్పాయి. 52 శాతం మంది మరల సీఎం జగన్ కావాలని కోరుకుంటున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఇక పొలిటికల్ క్రిటిక్ సంస్థ వచ్చే ఎన్నికలలో వైసిపి దాదాపు 115 స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. ఇక కూటమిగా ఏర్పడిన టిడిపి మరియు జనసేన 60 స్థానాలకు పరిమితం అవుతాయని సర్వేలో స్పష్టమైంది.
అదేవిధంగా మరోసారి లోక్ పాల్ సంస్థ ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టగా కేవలం లోక్ సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే చేపట్టడం జరిగింది. ఇక దీనిలో వైసీపీకి 13 నుంచి 15 లోక్ సభ స్థానాలు వస్తాయని, కూటమిగా ఏర్పడిన టిడిపి జనసేనకు 6 నుంచి 8 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక మరో సంస్థ అయిన జేన్ మత్ పోల్ కూడా తన సర్వేలను వెళ్లడం జరిగింది. ఇక ఈ సర్వేలో మొత్తం 175 స్థానాలకు గాను వైసిపి 114 నుండి 117 స్థానాలు గెలుచుకుంటుందని టిడిపి జనసేన కూటమి 49 నుంచి 51 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో పేర్కొంది. అయితే ఈ మూడు సంస్థల నుండి వచ్చిన ఫలితాలు వైసిపి పార్టీకి అనుకూల ఫలితాలుగా కనిపిస్తున్నాయి.
అయితే కొన్ని నెలల క్రితం ఏకపక్ష విజయాలను పార్టీ దక్కించుకొని ఉందని సర్వేలు తేల్చి చెప్పాయి. ఇక ఇప్పుడు విడుదలైన సర్వేల ఫలితాలు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటు పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు…మరియు అధికార పార్టీ అభ్యర్థుల మార్పు వంటివి ఓటర్స్ ను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ కచ్చితంగా ఉంటుందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.