Jammu And Kashmir : సరిహద్దుల్లో అర్ధరాత్రి ఏం జరిగింది అంటే.. బ్లాక్ ఔట్ ఎత్తివేత..!
Jammu And Kashmir : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రస్తుతం భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి.. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో చొరబాట్లు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే ఒక పాక్ రేంజర్.. సరిహద్దుల్లో భారత భూభాగంలోకి అడుగుపెట్టి భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు.
Jammu And Kashmir : సరిహద్దుల్లో అర్ధరాత్రి ఏం జరిగింది అంటే.. బ్లాక్ ఔట్ ఎత్తివేత..!
పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ తరువాత సరిహద్దుల్లో క్రమేణా మార్పు కనిపించింది. ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బ్లాక్ అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు నమోదు కాలేదు.
అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడంలేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతో ఉన్నాయి.కాల్పుల విరమణకు అంగీరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడం వల్ల రాత్రి అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ అమలు చేశారు. ఆ బ్లాక్ అవుట్‌ను ఉదయం ఎత్తివేశారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.