Pawan Kalyan Allu Arjun : మరోసారి పవన్ – బన్నీ ఫ్యాన్స్ మధ్య విభేదాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan Allu Arjun : మరోసారి పవన్ - బన్నీ ఫ్యాన్స్ మధ్య విభేదాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా వార్ రోజు రోజుకు ఎక్కువైపోతోంది. గతంలో నేతల మధ్య పరస్పర విమర్శలు పరిమితంగా ఉండేవి. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు పోలీసులు ఈ పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

Pawan Kalyan Allu Arjun : మరోసారి పవన్ – బన్నీ ఫ్యాన్స్ మధ్య విభేదాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు..!
Pawan Kalyan Allu Arjun : మార్క్ శంకర్ పై బన్నీ ఫ్యాన్స్ అనుచిత పోస్టులు.. కేసులు పెట్టిన పవన్ ఫ్యాన్స్
పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనతో అతను గాయాలపాలయ్యాడు. దేశమంతా ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వేళ, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పవన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. పవన్ ఫ్యాన్స్ ఫిర్యాదుతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను అల్లు అర్జున్ అభిమానిగా, మెగా ఫ్యామిలీపై ద్వేషంతో ఈ పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. అరెస్టైన రఘు గతంలో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టిన వాఖ్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కుమారుడిపై పెట్టిన అసభ్య పోస్టులపై విచారణ జరిపి మొత్తం 37 పోస్టులను గుర్తించి డౌన్‌లోడ్ చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వాటిపై కూడా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ సంఘటనతో మరోసారి పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ తీవ్ర రూపం దాల్చింది.