Home » Exclusive » Pawan Kalyan Achieved That Honor
Exclusive

pawan kalyan : చిరంజీవికి ద‌క్క‌ని గౌర‌వం ఇప్పుడు ప‌వ‌న్‌కి ద‌క్క‌నుందా.. ట్విస్ట్ ఏంటంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 27, 2024, 2:00 pm
Advertisement

pawan kalyan : ఈ సారి ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ గెలుపు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం విశేషం.టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కోగా, వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావ‌డంతో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎం బాధ్యతలు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్నారు. 20119లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్, ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.ఇక డిప్యూటీ సీఎంతో ప‌లు శాఖ‌ల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కేటాయించారు.

Advertisement

pawan kalyan త‌మ్ముడు సాధిస్తాడా..

ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌ల‌వ‌డం మ‌నం చూశాం. పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతల భేటీ జ‌ర‌గ‌గా, గంటకు పైగానే చ‌ర్చ‌లు సాగాయి. పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాతలంతా ఒకేసారి కలవడంపై ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే వాళ్లు మాత్రం కేవలం అభినందించడానికే అంటున్నారు. పవన్‌కు సన్మానం అనేది బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ విషయం చిరంజీవి ఫ్యాన్స్‌ను బాగా కలవరపెడుతుంది.. ఇంకా చెప్పాలంటే బాధ పెడుతుంది కూడా. చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినపుడు కూడా ఇలాగే మీడియా ముందుకొచ్చి ఇండస్ట్రీ అంతా కలిసి చిరుకు సన్మానం చేస్తాం.. అభినందన సభ పెడతాం అంటూ ఏవో మాట‌లు చెప్పారు.

pawan kalyan : చిరంజీవికి ద‌క్క‌ని గౌర‌వం ఇప్పుడు ప‌వ‌న్‌కి ద‌క్క‌నుందా.. ట్విస్ట్ ఏంటంటే..!

Advertisement

కాని అభినందన సభ మాటని ఇండస్ట్రీ పెద్దలు గాలికి వదిలేసినా.. అదే పెద్దలను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి నాన్నకు బహుమతి ఇచ్చారు రామ్ చరణ్. అయితే పవన్ డిప్యూటీ సిఎం అయినందుకు.. అభినందన సభ పెడతాం అంటున్నారు. ఇది నిల‌బెట్టుకుంటారా లేదా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ప‌వ‌న్ విష‌యంలో వారు మాట త‌ప్పే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వంతో వారికి పని పడుతుంది కాబట్టి. చిరంజీవికి దక్కని గౌరవం.. ఇప్పుడు తమ్ముడికి దక్కుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి