Pawan kalyan : ఏపీలో జనసేన, టీడీపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరో చెప్పిన పవన్ కళ్యాణ్…!
ప్రధానాంశాలు:
Pawan kalyan : ఏపీలో జనసేన, టీడీపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరో చెప్పిన పవన్ కళ్యాణ్...!
Pawan kalyan : ఏపీలో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు మొదలవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇక టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ వేదికగా జరిగిన బహిరంగసభ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీ వెనుక తాను నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదని, మార్పు కోసం తమను ఆశీర్వదించాలని పవన్ కోరారు. మంచి జరుగుతుందని ఉద్దేశంతో 2014లో టీడీపీ, బీజేపీ కి మద్దతు ఇచ్చినట్లుగా మరోసారి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు 2019లో అది కుదరలేదు.
2024 లో ఏపీ భవిష్యత్తు కోసం మరోసారి కలిసి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పదవి గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నిలబడిన స్థానాల్లో గెలిచి మద్దతిచ్చిన స్థానాలు అభ్యర్థులను గెలిపిస్తే జనసేన బలం ఏంటో అందరికీ తెలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు సీఎం పదవిని అడగగలమని కార్యకర్తలతో అన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జీవితంలో ఇప్పటికే ఎన్నో ఓటములు ఎదుర్కొన్నానని, తాను బ్రతికి ఉన్నంతవరకు జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలో జనసేన మారబోదని అన్న పవన్ మీ అభిమానం ఓట్లుగా మారాలని కార్యకర్తలను కోరారు. అలాగే ఈ సభలో పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు అంశం గురించి కూడా మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడుకున్నదని, ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు సైతం తెలియజేసినట్లు వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరకణ అనేది కూడా వివరించినట్లు వైజాగ్ సభలో వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిందన్న పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పై తన అభిప్రాయాన్ని అమిత్ షా గౌరవించారని తెలిపారు.
తాను ఎప్పుడు ఎన్నికల కోసం ఆలోచించలేదని, ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటేనే రాబోయే తరం కోసం పనిచేస్తానని అన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ కోరారు. మరోవైపు ఏపీలో ఆడపిల్లలకు భద్రత కావాలని, ఆడపిల్లల అదృశ్యంపై మాట్లాడితే తనను ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను సమర్థంగా వినియోగించడం లేదని, టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తే పోలీసు శాఖకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన చెప్పారు. సమర్ధులైన పోలీసు అధికారులను నియమించి శాంతిభద్రతలు కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు.