Categories: Newspolitics

Pawan kalyan : సినిమాల కోసం ప‌వన్ క‌ళ్యాణ్ అలాంటి నిర్ణ‌యం.. నాగ‌బాబు కోసం కేబినేట్‌లో మార్పులు చేర్పులు

Pawan kalyan : గ‌త కొద్ది రోజులుగా నాగ‌బాబు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. పవన్ కల్యాణ్​ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా, ఆయన ప్రమాణ స్వీకార తేదీపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట‌క్టుఏ తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల మలి జాబితా తదితర అంశాలపైనా ప‌వ‌న్ , చంద్ర‌బాబు ఇటీవ‌ల జ‌రిగిన భేటిలో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ సంగతి పక్కన పెడితే జనసేన పార్టీ నుంచి మంత్రి కాబోతున్న నాగబాబుకు పవన్ నిర్వహిస్తున్న కీలక శాఖలను కూడా ఇస్తారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేతిలో చాలా శాఖలు ఉన్నాయి. ఆయన ఎంతో మనసుపెట్టి తీసుకున్న విభాగాలవి.

Pawan kalyan : సినిమాల కోసం ప‌వన్ క‌ళ్యాణ్ అలాంటి నిర్ణ‌యం.. నాగ‌బాబు కోసం కేబినేట్‌లో మార్పులు చేర్పులు

Pawan kalyan నాగబాబుకి కీల‌క శాఖ‌లు..

పవన్ కళ్యాణ్ చేతిలో పర్యావరణం, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు ఉన్నాయి.. ప్రస్తుతం వీటిలో అటవీ శాఖను పవన్ కళ్యాణ్ వదులుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆయనకు అటవీ శాఖను అప్పజెప్పనున్నట్టుగా సమాచారం. ఒక‌వైపు త‌ను క‌మిటైన సినిమాలు షూటింగ్ పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు.ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. త్వరలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా జరగాల్సి ఉంది. వీటి కోసం మార్చి నెల నుండి పవన్ బిజీ కానున్నారు.

ఈ క్రమంలో త‌న పై ఒత్తిడి తగ్గించేందుకు అటవీ శాఖను నాగబాబుకి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు జనసేన పెద్దలు. మరో జనసేన నేత కందుల దుర్గేష్ వద్ద మూడు శాఖలు ఉన్నాయి. పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను దుర్గేష్ నిర్వహిస్తున్నారు. ఇందులో సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకి అప్పజెప్ప ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల నాగబాబుకి అటవీ సినిమాటోగ్రఫీ లాంటి కీలక శాఖలు ద‌క్క‌నున్నాయి. ఆ శాఖలు ప్రస్తుతం జనసేన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మరో జనసేన నేత నాగబాబు కి అవి కట్టబెట్టినా సమస్య ఏదీ ఉండదనేది సీయం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మ‌రి వీటిపై అఫీషియ‌ల్ ప్ర‌కట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Recent Posts

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

41 minutes ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

2 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

3 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

4 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

5 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

6 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

7 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

7 hours ago