Game Changer : రామ్ చరణ్ సినిమా కోసం వస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకే వేదికపై శంకర్, పవన్
ప్రధానాంశాలు:
Game Changer : రామ్ చరణ్ సినిమా కోసం వస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకే వేదికపై శంకర్, పవన్
Game Changer : మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’.,.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో క్రేజీ హిట్ సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు.జనవరి మొదటి వారంలో ఏపీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట.గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను దించుతారని అంటున్నారు. అబ్బాయ్ కోసం బాబాయ్ కచ్చితంగా వస్తాడు. అందులో సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు. ఏపీలో కూటమి వచ్చాక ఇంత వరకు అక్కడ ఓ పెద్ద ఈవెంట్ ఏదీ నిర్వహించలేదు. కల్కి టైంలో ప్రభాస్ వద్దని చెప్పడంతో అశ్వనీదత్ ఈవెంట్ పెట్టలేదట.
Game Changer అంచనాలు పీక్స్‌లో..
దేవరకు పర్మిషన్స్ దొరకలేదు. మరి గేమ్ ఛేంజర్‌కి ఏపీలో పర్మిషన్స్ వస్తే.. భారీ ఈవెంట్ నిర్వహించే ఛాన్స్ మాత్రం ఉంది. ఒకే వేదికపై చాలా కాలం తర్వాత రాంచరణ్, పవన్ కనిపించబోతున్నారు. వీరితో కలసి డైరెక్టర్ శంకర్ కూడా స్టేజిపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్.. రాంచరణ్ నాయక్ మూవీ ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు. బాబాయ్, అబ్బాయి ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పవచ్చు.
ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈవెంట్ ప్లాన్ చేస్తారని అంటున్నారు. అయితే ఆల్రెడీ కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్ ‘గేమ్ ఛేంజర్’ యూనిట్ నుంచి నిర్వాహకులు పరిశీలించారు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనున్నారు.