Pawan kalyan : సినిమాల కోసం పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం.. నాగబాబు కోసం కేబినేట్‌లో మార్పులు చేర్పులు
ప్రధానాంశాలు:
Pawan kalyan : సినిమాల కోసం పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం.. నాగబాబు కోసం కేబినేట్‌లో మార్పులు చేర్పులు
Pawan kalyan : గత కొద్ది రోజులుగా నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా, ఆయన ప్రమాణ స్వీకార తేదీపై ఓ నిర్ణయానికి వచ్చినటక్టుఏ తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల మలి జాబితా తదితర అంశాలపైనా పవన్ , చంద్రబాబు ఇటీవల జరిగిన భేటిలో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ సంగతి పక్కన పెడితే జనసేన పార్టీ నుంచి మంత్రి కాబోతున్న నాగబాబుకు పవన్ నిర్వహిస్తున్న కీలక శాఖలను కూడా ఇస్తారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేతిలో చాలా శాఖలు ఉన్నాయి. ఆయన ఎంతో మనసుపెట్టి తీసుకున్న విభాగాలవి.
Pawan kalyan నాగబాబుకి కీలక శాఖలు..
పవన్ కళ్యాణ్ చేతిలో పర్యావరణం, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు ఉన్నాయి.. ప్రస్తుతం వీటిలో అటవీ శాఖను పవన్ కళ్యాణ్ వదులుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆయనకు అటవీ శాఖను అప్పజెప్పనున్నట్టుగా సమాచారం. ఒకవైపు తను కమిటైన సినిమాలు షూటింగ్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు.ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. త్వరలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా జరగాల్సి ఉంది. వీటి కోసం మార్చి నెల నుండి పవన్ బిజీ కానున్నారు.
ఈ క్రమంలో తన పై ఒత్తిడి తగ్గించేందుకు అటవీ శాఖను నాగబాబుకి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు జనసేన పెద్దలు. మరో జనసేన నేత కందుల దుర్గేష్ వద్ద మూడు శాఖలు ఉన్నాయి. పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను దుర్గేష్ నిర్వహిస్తున్నారు. ఇందులో సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకి అప్పజెప్ప ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల నాగబాబుకి అటవీ సినిమాటోగ్రఫీ లాంటి కీలక శాఖలు దక్కనున్నాయి. ఆ శాఖలు ప్రస్తుతం జనసేన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మరో జనసేన నేత నాగబాబు కి అవి కట్టబెట్టినా సమస్య ఏదీ ఉండదనేది సీయం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మరి వీటిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.