Pawan kalyan : కొల్లేరు కాంటూరి లెక్కలు తెలుస్తాం… జగన్ తిక్క తీరుస్తాం… పవన్ కళ్యాణ్..!
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గంలోని గన్నవరంలో వారాహి విజయభేరి భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో సభ మొత్తం జనసంద్రంతో మునిగిపోయింది. ఇక ఈ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తొక్కలో గవర్నమెంట్ అని ఎద్దేవా చేశారు. వారు అరటిపండు తినేసి తొక్క మనపై వేశారని తెలియజేశారు. ఆ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ అని గాలి తక్కువగా వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి ,కంకర లారీలను 8,000 కి అమ్ముకునే వారు కాదు ధర్మరాజు లాంటి దమ్మున్న నాయకుడు మనకి కావాలని , తాగునీటి సౌకర్యం కావాలంటే మనకోసం మహేష్ యాదవ్ గారు అండగా నిలబడతారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
Pawan kalyan : కొల్లేరు కలలు మారాలంటే ప్రభుత్వం మారాల్సిందే…
అలాగే వైసీపీ ప్రభుత్వం దేవుడు మాన్యాలను కాజేస్తుందని అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని దేవుడు మాన్యాల పై చేయి వేస్తే తరతరాలు లేకుండా పోతాయని ఒకానొక సందర్భంలో చాణక్యుడు చెప్పిన మాటను పవన్ కళ్యాణ్ గుర్తుచేసారు. ఇక వైసీపీ నాయకులకు భూమి పిచ్చి ఎక్కువైపోయిందని ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ్క కబ్జా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు ఎంత భూమిని కబ్జా చేసినా సరే ఒకరోజు మీరు కూడా ఆ భూమి లోకి వెళ్లాల్సిన వారే అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక కొల్లేరు ప్రాంతంలో చాపల చెరువు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడినుండి చాపలు రొయ్యలు ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటాయి. కానీ కొల్లేరు కాంటూరి సమస్య కారణంగా చాపల చెరువు వ్యాపారులు ఇబ్బంది పడతున్నారు. వైయస్సార్ గారు అధికారంలో ఉన్నప్పుడు కొల్లేరు సంరక్షణ కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ కొల్లేరులో చాలా చెరువులను ధ్వంసం చేశారు. బాంబులు పెట్టి పేల్చారు.
కాంటూరు లెక్కలను పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా ధ్వంసం అయ్యాయి. ఇక వీటన్నిటికీ పరిహారం ఇస్తామని మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని , తాము అధికారంలోకి వస్తే ఈ సమస్య కచ్చితంగా తీరుస్తామని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇక ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి ధర్మరాజు గారు ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్యను పరిష్కరిస్తారని టీడీపీ ,జనసేన, బీజేపీ కూటమి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుందని తెలియజేశారు. అలాగే తాము అధికారంలోకి వస్తే కాంటూరు లెక్కలను తేలుస్తామని , కంటూరు లెక్కలను తేల్చినట్లయితే దాదాపు పదివేల ఎకరాల రైతులకు మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కాబట్టి దీనిపై కూడా మేము తగిన చర్యలు తీసుకుని సహాయపడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కావున ఈసారి కూటమికి అండగా నిలబడి అధికారం ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరారు.