Pawan Kalyan : మీ రాజకీయాల కోసం రజనీకాంత్‌ను తిట్టడానికి సిగ్గుండాలి? పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ అదుర్స్
ప్రధానాంశాలు:
మహా మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ ను ప్రారంభించిన పవన్
చిత్రపరిశ్రమను కేవలం టీఆర్పీ కోసం మాత్రమే వాడుకోకండి
చిత్రపరిశ్రమే అందరి టార్గెట్
Pawan Kalyan : ఇటీవల మహా మ్యాక్స్ అనే కొత్త ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మహా న్యూస్ చానెల్ వాళ్లే మహా మ్యాక్స్ అనే ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగానికి సంబంధం ఉంది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ల మీద ఏది పడితే అది మాట్లాడుతారు. దానికి కారణం.. సినిమా ఇండస్ట్రీ వాళ్లు అందరికీ సాఫ్ట్ టార్గెట్ అవుతారు. సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్లపై రాళ్లు వేయడం.. వాళ్లపై ఏది పడితే అది మాట్లాడటం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. చిత్ర పరిశ్రమకు ఏదైనా సమస్య ఉంటే.. కొన్ని మీడియా చానెళ్లు మద్దతు ఇచ్చాయి. అందులో మహా న్యూస్ చానెల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దానికి నేను అభినందిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
టీవీ చానెల్ కి, టీవీలో వచ్చే న్యూస్ కు ఎలాంటి సెన్సార్ ఉండదు. కానీ.. చిత్ర పరిశ్రమలో సినిమా విడుదల చేయాలంటే దానికి సెన్సార్ ఉంటుంది. చిత్ర పరిశ్రమ సమస్యలను చాలామంది పట్టించుకోరు కానీ.. చిత్ర పరిశ్రమను ఆధారంగా చేసుకొని ఎదిగిన ఎన్నో చానెళ్లు ఉన్నాయి. ఇప్పటికైనా కనీసం మీరు అయినా చిత్ర పరిశ్రమ గురించి, లోతుగా విశ్లేషించి పాయింట్ ఆఫ్ వ్యూను తీసుకురావాలి. ఉదాహరణకు మొన్న రజినీకాంత్ గారిని విమర్శించారు. అలా అని చెప్పి ఆయన్ను మీడియా వాళ్లు తీసుకొచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే.. చిత్ర పరిశ్రమ అనేది వల్నరబుల్. ఆ పరిశ్రమే అలాంటిది. వాళ్లు కళాకారులు. వాళ్లు ఎవరి జోలికి వెళ్లరు. వాళ్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఎలా అలరించాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటారు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan : ప్రజల సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్లాలి
ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలే కాదు.. ప్రజల సమస్యలను కూడా మీడియా చానెళ్లు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంట్రవర్సీ అనేదాన్ని అమ్ముకోకుండా.. కళను బతికించాలి. సమాజంలో అసహ్యం పెరిగిపోయింది. కావాలని చిత్ర పరిశ్రమ మీద బురద జల్లే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మీడియా అవకాశంగా తీసుకొని ఇంకాస్త ఆజ్యం పోయొద్దు. చిత్ర పరిశ్రమను టీఆర్పీ కోసం వాడుకుంటారు కానీ.. చిత్ర పరిశ్రమ తాలుకు లోతైన సమస్యలు ఏంటి.. అకారణంగా వాళ్ల మీద మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేవి మీ చానెల్ లో చేయగలిగితే మీరు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేసిన వాళ్లు అవుతారు.. అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.